Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. నాగుపామును ఒట్టి చేతులతో ఎలా పట్టాడో చూస్తే..

ABN , Publish Date - Jul 11 , 2024 | 12:30 PM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే స్నేక్ క్యాచింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతుంటాయి. కొందరు పాములను...

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. నాగుపామును ఒట్టి చేతులతో ఎలా పట్టాడో చూస్తే..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే స్నేక్ క్యాచింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతుంటాయి. కొందరు పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చూస్తుంటాం. మరికొందరు పామునులను పట్టే పద్ధతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పామును పట్టిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగు పాము (Cobra) ఇటుకల గోడలోకి వెళ్లడంతో సదరు ఇంటి యజమానులు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను.. ముందుగా ఇటుకలను తొలగించి పాము ఉన్న ప్రాంతాన్ని గుర్తించాడు. తర్వాత ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఒట్టి చేతులతో పాము తోక పట్టుకుని బయటికి లాగేశాడు.

Viral Video: కుక్క, కోడి, కోతి.. కామెడీ మామూలుగా లేదుగా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ క్రమంలో పాము మెలికలు తిరుగుతూ అతన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినా అతను దాని కాటు నుంచి తప్పించుకుంటూ రోడ్డు పైకి తీసుకెళ్తాడు. తర్వాత ఆ పామును సంచిలో వేసేందుకు ప్రయత్నించగా పాము అటూ ఇటూ మెలికలు తిరుగుతూ ఉండడంతో సాధ్యం కాదు. ఈ క్రమంలో ఎక్కడ కాటేస్తుందేమో అని అంతా భయపడతారు. అయితే పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ.. చివరకు పామును సంచిలో వేసి చుట్టేస్తాడు.

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. ఉన్నట్టుండి తల కిందకు దూరిన పాము.. చివరకు..


ఈ వీడియో ఇంతటితో ముగస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పాములు పట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలీదంటే ఇదేనేమో.. వెనుకే వెళ్లి చెవి దగ్గర హారన్ కొట్టగా.. చివరకు..

Updated Date - Jul 11 , 2024 | 12:30 PM