Share News

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:37 PM

ఇళ్లు, వాహనాలు తదితర ప్రదేశాల్లో ఊహించని విధంగా పాములు దర్శనమిస్తుంటాయి. చివరకు కొన్నిసార్లు ఫ్రిడ్జిలు, వాహనాల సీట్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. ఇలాంటి..

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

ఇళ్లు, వాహనాలు తదితర ప్రదేశాల్లో ఊహించని విధంగా పాములు దర్శనమిస్తుంటాయి. చివరకు కొన్నిసార్లు ఫ్రిడ్జిలు, వాహనాల సీట్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి గాఢ నిద్రలో ఉండగా.. ఓ పెద్ద పాము దూసుకొచ్చింది. యువతి మీదకు వెళ్లగానే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) గడ్డి నేలపై చాప పరుచుకుని పడుకుని ఉంటుంది. బాగా గాఢనిద్రలో (sleeping) ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద పాము (snake) పాక్కుంటూ ఆమె సమీపానికి వెళ్తుంది. అంతటితో ఆగకుండా పాక్కుంటూ ఏకంగా ఆమె మీదకు వెళ్తుంది. పాము మెడపైకి రాగానే.. యువతి ఉలిక్కిపడి లేస్తుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..


పామును చూసి షాక్ అయిన యువతి.. అక్కడి నుంచి పక్కకు పారిపోతుంది. అయితే ఆ పాము ఆమెకు ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..

Updated Date - Jul 07 , 2024 | 04:37 PM