Share News

Viral Video: పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లిన యువతి.. లోపలి నుంచి వింత శబ్ధం రావడంతో.. డోరు తీసి చూడగా..

ABN , Publish Date - Jul 06 , 2024 | 08:54 PM

కొన్నిసార్లు కొందరికి ఇళ్లు, ఇంటి పరిసరాల్లో షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లో మంచాలు, ఫ్రిడ్జిలు తదితర ప్రదేశాల నుంచి...

Viral Video: పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లిన యువతి.. లోపలి నుంచి వింత శబ్ధం రావడంతో.. డోరు తీసి చూడగా..

కొన్నిసార్లు కొందరికి ఇళ్లు, ఇంటి పరిసరాల్లో షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లో మంచాలు, ఫ్రిడ్జిలు తదితర ప్రదేశాల నుంచి పాములు బయటికి రావడం చూశాం. అలాగే కొన్నిసార్లు ఇళ్లలోకి క్రూరమృగాలు రావడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లిన యువతి.. లోపలి నుంచి వింత శబ్ధాలు రావడంతో డోరు తీసింది. చివరకు లోపలి దృశ్యం చూసి షాక్ అయింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) పండ్ల బాక్స్ తీసుకుని ఇంటి బయట పార్క్ చేసిన కారు వద్దకు వెళ్తుంది. అయితే తీరా కారు డోరు వద్దకు రాగానే లోపలి నుంచి వింత శబ్ధాలు రావడంతో డోరు తీసి చూసింది. తీరా కారు లోపలికి ఎలుగుబంటి దూరడం చూసి షాక్ అయింది. ఎలుగుబంటి బయటికి రాకుండా డోరు వేయాలని చూస్తుంది. అయితే ఎలుగుబంటి (bear came out of the car) బలంగా డోరును తోసి బయటికి వస్తుంది. దీంతో యువతి చేతిలోని పండ్ల బాక్స్‌ను కిందపడేసి పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది.

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


బయటికి వచ్చిన ఎలుగుబంటి అటూ ఇటూ చూసి కిందపడ్డ పండ్లను తినే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుగుబంటికి కారంటే బాగా ఇష్టమున్నట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘యువతికి షాక్ ఇచ్చిన ఎలుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..

Updated Date - Jul 06 , 2024 | 08:54 PM