Share News

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:50 PM

పాముల సమీపానికి వెళ్లడం మాట అటుంచి.. వాటిని దూరం నుంచి చూడాలన్నా భయమేస్తుంటుంది. అలాంటిది ఇక పాములు ఎదురుగా కనిపిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నిసార్లు కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

పాముల సమీపానికి వెళ్లడం మాట అటుంచి.. వాటిని దూరం నుంచి చూడాలన్నా భయమేస్తుంటుంది. అలాంటిది ఇక పాములు ఎదురుగా కనిపిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నిసార్లు కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు ఇంట్లో ఆడుకుంటుండగా.. ఓ పెద్ద పాము లోపలికి వచ్చింది. చివరకు బుడ్డోడు చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పెద్ద పాము ఉన్నట్టుండి లోపలికి వచ్చేస్తుంది. దాన్ని చూసి భయంతో పారిపోవాల్సిన పిల్లాడు.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఇంట్లోని వచ్చిన పాము.. చివరకు ఓ టేబుల్ కిందకు దూరుతుంది. దాన్ని గమనించిన బుడ్డోడు.. టేబుల్ వద్దకు వెళ్లి పాము తోక పట్టుకుంటాడు. దాన్ని బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: ఇంటి ముందు మృత్యుబావిలో పడిన బాలిక.. తల్లి కేకలు పెడుతున్నా ఫలితం శూన్యం.. చివరకు..


అయితే పాము పిల్లాడి నుంచి తప్పించుకనేందుకు ప్రయత్నిస్తుంది. అయినా బాలుడు దాన్ని (boy pulled out the snake) వదలకుండా బలంగా బయటికి లాగేస్తాడు. తర్వాత దాన్ని అలాగే బయటికి తీసుకొచ్చేస్తాడు. పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న ఈ బాలుడిని చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన చూస్తుంటే పిల్లాడితో కావాలనే ఇలా చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పాము విషపూరితం కాకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

Viral Video: బస్సు డోరు వద్ద నిల్చున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సీసీ ఫుటేజీ చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ బాలుడి ధైర్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలతో ఇలాంటి పనులు చేయించకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 08:50 PM