Share News

Viral Video: సినిమాటిక్ షాట్ కోసం ఐఫోన్‌ను కాలువలోకి వదిలాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Jul 04 , 2024 | 06:56 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది యువత వీడియోలు, రీల్స్ రూంపలో తమ టాలెంట్ రూపంలో బయటపెడుతున్నారు. కొందరు సినిమాటిక్ షాట్స్ తీస్తూ నెట్టింట వైరల్ అవుతుంటే.. మరికొందరు ..

Viral Video: సినిమాటిక్ షాట్ కోసం ఐఫోన్‌ను కాలువలోకి వదిలాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది యువత వీడియోలు, రీల్స్ రూంపలో తమ టాలెంట్ రూపంలో బయటపెడుతున్నారు. కొందరు సినిమాటిక్ షాట్స్ తీస్తూ నెట్టింట వైరల్ అవుతుంటే.. మరికొందరు సినిమా సీన్లకు మించిన సీన్స్ క్రియేట్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు సినిమాటిక్ షాట్ కోసం ఐఫోన్‌ను కాలువలోకి వదిలాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వినూత్న రీతిలో రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరిలా కాకుండా రీల్స్‌ను సినిమా స్టైల్లో తీయాలనే ఉద్దేశంతో చివరకు కాలువ వద్దకు వెళ్లాడు. కాలువపై ఉన్న బ్రిడ్జి వద్ద కూర్చుని తన ఐఫోన్‌ను (iPhone) బయటికి తీశాడు. చివరకు దాన్ని తన చెప్పుపై పెట్టి నీటిలో వదిలేశాడు. అది తేలుతూ బ్రిడ్జిని దాటుకుని అటువైపు వచ్చాక తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే చెప్పుపై ఐఫోన్‌ను పెట్టి నీటిలో వదిలేశాడు. అది పడవలా బ్రిడ్జి కిందకు దూసుకెళ్లింది. దాన్ని తీసుకోవడానికి యువకుడు బ్రిడ్జి అటువైపు వెళ్లాడు.

Viral Video: పిల్లాడిని గాల్లోకి ఎగరేసిన మహిళ.. ఇలా ఎందుకు చేసిందని తీక్షణంగా చూడగా..


అయితే తీరా చూస్తే అటువైపు చెప్పు ఒక్కటే వచ్చింది. అందులో ఐఫోన్ మాత్రం కనిపించలేదు. బ్రిడ్జి కింద చెప్పు బోల్తా పడి (iPhone fell into water) ఐఫోన్ నీటిలో పడిపోయింది. ఇలా తన సినిమాటిక్ షాట్ కాస్తా.. ఫెయిల్ షాట్‌గా మారిపోయింది. విలువైప ఫోన్ నీటిలో పడిపోవడంతో షాక్ అవడం యువకుడి వంతైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రయోగం వికటించింది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఐఫోన్ నీటి పాలైందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 06:56 PM