Share News

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jul 03 , 2024 | 07:25 PM

కొందరు తమ ఇళ్లలో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫ్రిడ్జ్ ఎదురుగా కూలర్ ఉంచి చల్లదనాన్ని ఆస్వాదిస్తే.. మరికొందరు కూలర్ లోపల కూరగాయలు, పండ్లు పెట్టి.. దాన్నే...

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

కొందరు తమ ఇళ్లలో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫ్రిడ్జ్ ఎదురుగా కూలర్ ఉంచి చల్లదనాన్ని ఆస్వాదిస్తే.. మరికొందరు కూలర్ లోపల కూరగాయలు, పండ్లు పెట్టి.. దాన్నే ఫ్రిడ్జ్‌లా ఉపయోగిస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా ఇటుకలనే కూలర్ తరహాలో నిర్మించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ ఇటుకలతో వాషింగ్‌మెషిన్‌ను నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్‌మెషిన్ (Washing machine) కొనే పని లేకుండా.. తన ఇంట్లో ఉన్న ఇటుకలతోనే అలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటుకలతో (bricks) నిర్మాణం మొదలెట్టింది. ఓ వైపు నీళ్లు నిలబడేందుకు తొట్టి ఆకారంలో నిర్మించి, రెండో వైపు బట్టలు ఉతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంది.

Viral Video: ఇదేం ఐడియారా బాబూ..! స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చేశాడుగా..


ఫైనల్‌గా ఆ కట్టడానికి సిమెంట్ వేసి పని ప్రారంభించింది. కొళాయి నుంచి తొట్టిలోకి నీళ్లు వదిలి, అందులో దస్తులను నానబెట్టింది. తర్వాత అటు పక్కనే ఉన్న స్థలంలో బట్టలును ఉతికేసింది. ఉతికిన బట్టలను మళ్లీ తొట్టిలో ముంచి శుభ్రం చేసేసింది. ఇందుకోసం పదే పదే బకెట్ నీళ్లు మార్చకుండా.. తొట్టి కింద మురుగు నీరు వెళ్లేలా ఇంకొ కొళాయి ఏర్పాటు చేసింది. ఇలా మురుగు నీటిని బయటకు వదలడం, కొళాయి నీటిని మళ్లీ వదిలి అందులో దస్తులను శుభ్రం చేస్తోంది.

Viral Video: పానీపూరీతో ఇదేం కాంబినేషన్ బాబోయ్.. ఈమె తింటున్నదేంటో తెలిస్తే..


ఇలా కూర్చునే పని లేకుండా నిలబడుకునే సులభంగా బట్టలన్నింటినీ ఉతికేసింది. ఈమె తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హోమ్ మేడ్ వాషింగ్‌మెషిన్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఐస్‌క్రీం అమ్ముతూనే కారు యజమానిపై కన్నేసిన మహిళ.. చివరకు బాలికను ఎలా కాపాడిందంటే..

Updated Date - Jul 03 , 2024 | 07:25 PM