Share News

Viral Video: బట్టలు ఉతుకుతున్న ప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:09 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బట్టలు ఉతకడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ అని అనుకుంటున్నారా.. ఆమె బట్టలు ఉతుకుతూ..

Viral Video: బట్టలు ఉతుకుతున్న ప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అధిక శాతం మంది పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఫోన్‌లోనే మునిగిపోతుంటారు. చివరకు భోజనం చేసే సమయం, ఆఖరికి పడుకునే సమయంలోనూ ఫోన్‌ను పక్కే పట్టుకుంటారు. ఇంకొందరైతే ఈ పిచ్చిలో పడి ప్రమాదంలో పడిన సందర్భాలను కూడా చూస్తుంటాం. అయినా చాలా మందిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా, ఓ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. బట్టలు ఉతుకున్నప్పుడు కూడా ఓ మహిళ చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బట్టలు ఉతకడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ అని అనుకుంటున్నారా.. ఆమె బట్టలు ఉతుకుతూ ఫోన్ చూడడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అందులోనూ ఫోన్ చూసేందుకు వీలుగా ఆమె చేసిన నిర్వాకం చూసి అవాక్కవుతున్నారు. టబ్‌లో బట్టలు వేసుకున్న మహిళ.. వాటిని శుభ్రం చేయడానికి సిద్ధమైంది.

Viral: ముక్కులో ఊపిరాడక వైద్యుడి వద్దకు వెళ్లిన రోగి.. పరీక్షించి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..


ఇంతవరకూ బాగానే ఇక్కడే ఆమె అతి తెలివిని ఉపయోగించింది. ఒక్క క్షణం కూడా ఫోన్ చూడకుండా ఉండలేని ఆమె... బట్టలు ఉతికేటప్పుడు కూడా ఫోన్ చూడాలని అనుకుంది. ఇందుకోసం ఫోన్‌ను ఓ కవర్‌లో చుట్టేసింది. తర్వాత ఆ కవర్‌ను ఓ కర్రకు కట్టి, చివరగా ఆ కర్రను తన తలకు కట్టేసుకుంది. ఈ విధంగా ఓ వైపు బట్టలు ఉతుకుతూ, మరోవైపు ఫోన్ (woman washing clothes while looking at phone) చూసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది.

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె అతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

Updated Date - Jul 02 , 2024 | 04:09 PM