Share News

Viral Video: ఊరేగింపులోనే తొందరపడ్డ వరుడు.. బంధువుల ముందే అతడు చేసిన నిర్వాకానికి..

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:36 PM

వివాహం అంటేనే సరదాలు, సంతోషాలకు నిలయమని చెప్పొచ్చు. అలాంటి వివాహ కార్యక్రమాలకు ప్రస్తుతం సోషల్ మీడియా తోడైంది. దీంతో పెళ్లిళ్లలో వినోదాలకు కొదవే లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో...

Viral Video: ఊరేగింపులోనే తొందరపడ్డ వరుడు.. బంధువుల ముందే అతడు చేసిన నిర్వాకానికి..

వివాహం అంటేనే సరదాలు, సంతోషాలకు నిలయమని చెప్పొచ్చు. అలాంటి వివాహ కార్యక్రమాలకు ప్రస్తుతం సోషల్ మీడియా తోడైంది. దీంతో పెళ్లిళ్లలో వినోదాలకు కొదవే లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వరుడు ఊరేగింపు సమయంలో చేసిన నిర్వాకానికి బంధువులు అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ వరుడికి తొందర ఎక్కువైంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు (bride and groom) ఊరేగింపుగా వస్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం వరుడు.. వధువుతో కలిసి తన ఇంటికి ఊరేగింపుగా బయలుదేరాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: పానీపూరీతో ఇదేం కాంబినేషన్ బాబోయ్.. ఈమె తింటున్నదేంటో తెలిస్తే..


కళ్యాణ మంటపం నుంచి ముసుగులో ఉన్న వధువును ఎప్పుడెప్పుడు చూడాలా అనుకుంటూ వరుడు తొందరపడుతూ వచ్చాడు. ఊరేగింపులో ఉండగా తన ఉత్సాహాన్ని ఆపుకోలేక.. వధువు ముఖంపై ఉన్న ముసుగును పైకి తీశాడు. వధువు ముఖాన్ని చూసి.. ‘‘వావ్.. నాకు ఎంతో అందమైన భార్య వచ్చింది’’.. అని అనుకుంటూ మురిసిపోతాడు. ఊరేగింపులో ఉండగానే వధువు ముసుగును తీసిన వరుడిపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

Viral Video: ఐస్‌క్రీం అమ్ముతూనే కారు యజమానిపై కన్నేసిన మహిళ.. చివరకు బాలికను ఎలా కాపాడిందంటే..


వెనుక ఉన్న వ్యక్తి వరుడి తలపై చేత్తో కొడుతూ.. ‘‘ఇలా మధ్యలోనే ముసుగు తీయడం ఏంటీ.. అంత తొందర ఎందుకు’’.. అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతను లక్కీఛాన్స్ కొట్టాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 03 , 2024 | 08:36 PM