Share News

Viral Video: పిల్లాడిని గాల్లోకి ఎగరేసిన మహిళ.. ఇలా ఎందుకు చేసిందని తీక్షణంగా చూడగా..

ABN , Publish Date - Jul 04 , 2024 | 03:14 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వినోదానికి సంబంధించినవి కొన్నూతే.. మరికొన్ని చూడగానే షాక్ అయ్యేలా ఉంటాయి. ఇంకొన్ని..

Viral Video: పిల్లాడిని గాల్లోకి ఎగరేసిన మహిళ.. ఇలా ఎందుకు చేసిందని తీక్షణంగా చూడగా..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వినోదానికి సంబంధించినవి కొన్నూతే.. మరికొన్ని చూడగానే షాక్ అయ్యేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలేమో మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. మొత్తానికి ఇలాంటి చిత్రచిత్ర వీడియోలన్నీ కలిసి నెటిజన్లకు వినోదాన్ని అందిస్తు్ంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పిల్లాడిని చేత్తో పట్టుకుని గాల్లోకి విసిరేసింది. ఆమె ఎందుకు ఇలా చేసిందని తీక్షణంగా చూడగా.. చివరకు అసలు విషయం తెలిసిపోయింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో చాలా మంది మహిళలు సందడి సందడిగా గడుపుతుంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన చేతుల్లో పిల్లాడిని పట్టుకుని కనిపించింది. అంతలోనే ఆమె చేతిలో ఉన్న పిల్లాడిని పైకెత్తి వెనక ఉన్న (woman threw the child into air) మహిళ చేతిలోకి వెళ్లేలా గాల్లోకి విసిరేసింది. అయితే ఆ పిల్లాడు ఆమె చేతిలోకి కాకుండా ధబేల్‌మని కిందపడిపోతాడు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ‘‘పిల్లాడిని ఇలా విసిరేశావ్.. నువ్వు మనిషేవేనా’’.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

Viral Video: మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో.. ఎవరూ ఊహించని విధంగా ఇతనెలా చనిపోయాడో చూస్తే..


అయితే ఆమె ఎందుకు ఇలా చేసిందని చాలా మంది తీక్షణంగా పరిశీలించగా.. ఆమె చేతిలో ఉన్నది పిల్లాడి ఆకారంలో ఉన్న బొమ్మ (child toy) అని తెలిసింది. అయితే ఆ బొమ్మ చూసేందుకు మాత్రం అచ్చం ప్రాణం ఉన్న పిల్లాడిలాగే ఉండడంతో అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘చూస్తుంటే నిజంగా పిల్లాడిని విసిరేసినట్లుగానే ఉంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలతో మాత్రం ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 63 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 03:14 PM