Share News

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..

ABN , Publish Date - Jul 04 , 2024 | 07:08 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వివాహ కార్యక్రమాల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు కూడా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ..

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వివాహ కార్యక్రమాల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు కూడా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై పైకి ఉన్నట్టుండి వరుడి ప్రియురాలు దూసుకొచ్చింది. చివరకు ఆమె చేసిన నిర్వా్కానికి అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా.. బంధువులంతా ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. చీర ధరించిన వరుడి ప్రియురాలు.. వధూవరులు కూర్చున్న సోఫా వెనుక వైపుగా వచ్చింది. వరుడితో గొడవ పడడమో.. లేక వారితో కలిసి ఫొటో దిగి శుభాకాంక్షలు తెలియజేయడమో చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.

Viral Video: సినిమాటిక్ షాట్ కోసం ఐఫోన్‌ను కాలువలోకి వదిలాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..


వధూవరులు కూర్చున్న సోఫా వెనుకగా వచ్చిన ఆమె.. (young woman threw currency notes on bride and groom) చేతిలోని కరెన్సీ నోట్లను వెదజల్లుతుంది. వధూవరులపై కరెన్సీ నోట్లను చల్లిన ఆమె.. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కరెన్సీ నోట్లు తమపై పడడం చూసి వరుడితో పాటూ వధువు కూడా అవాక్కవుతుంది. ఈ ఘటన అక్కడున్న వారందరూ షాక్ అయ్యేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ప్రవర్తన విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈమె తన కోపాన్ని కరెన్సీ నోట్ల ద్వారా చూపించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 07:10 PM