Share News

Viral Video: బస్సు డోరు వద్ద నిల్చున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సీసీ ఫుటేజీ చూడగా..

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:43 PM

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..

Viral Video: బస్సు డోరు వద్ద నిల్చున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సీసీ ఫుటేజీ చూడగా..

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సు డోరు వద్ద నిల్చున్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ చూసిన వారంతా.. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు నమక్కల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జేదర్‌పాళయం అనే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ బట్టలు కొనేందుకు సేలం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆమె ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ఆమె డోరు వద్ద నిల్చుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బస్సు కక్కవేరి అనే ప్రాంతం దాటగానే ఓ టర్నింగ్ వద్ద డ్రైవర్ వేగంగా మలుపు తిప్పుతాడు.

Viral Video: ఇంటి ముందు మృత్యుబావిలో పడిన బాలిక.. తల్లి కేకలు పెడుతున్నా ఫలితం శూన్యం.. చివరకు..


డ్రైవర్ మలుపు తిప్పగానే సదరు మహిళ (Woman Falling From Bus) అదుపుతప్పి కిందపడిపోతుంది. బస్సు వేగంగా వెళ్తుండడంతో రోడ్డుపై పడ్డ ఆమె చాలా దూరం వరకూ పల్టీలు కొట్టుకుంటూ వచ్చింది. మహిళ కిందపడడాన్ని చూసి ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. ప్రయాణికులంతా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..


ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, బస్సు ప్రమాద ఘటన మొత్తం లోపల ఉన్న సీసీ కెమెరాలో (CCTV footage) రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘డోరు వద్ద నిల్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 08:43 PM