Share News

Viral Video: యజమానిపై పగ తీర్చుకున్న కుక్క.. వంటింట్లో అది చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:41 PM

కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం వారి ఇంటికి కాపలాగా ఉంటాయి. వాటి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ...

Viral Video: యజమానిపై పగ తీర్చుకున్న కుక్క.. వంటింట్లో అది చేసిన పని చూస్తే..

కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం వారి ఇంటికి కాపలాగా ఉంటాయి. వాటి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ యజమానులను కాపాడుతుంటాయి. కుక్కలకు ద్రోహం చేసిన యజమానులు ఉంటారేమో గానీ.. యజమానికి నష్టం చేసిన కుక్కలు ఇప్పటివరకూ మనం చూడలేదు. అయితే తాజాగా, ఓ పెంపుడు కుక్క చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. తన యజమానిపై కక్ష తీర్చుకోవడం కోసం వంటింట్లోకి వెళ్లిన కుక్క చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని (America) కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో జూన్ 26న వేకువజాము ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం (fire accident) జరగడంతో ఇంట్లో అలారం మోగింది. దీంతో విషయం ఇంటి యజమానికి తెలిసి.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.

Viral Video: రీల్స్ కోసం బాలిక వింత ప్రవర్తన.. స్లోమోషన్ చేసే క్రమంలో ఆమె చేసిన నిర్వాకం..


అదే సమయంలో ఆ వ్యక్తి కూడా ఇంటికి వెళ్లగా అప్పటికే మంటలు ఆరిపోయాయి. ఇంట్లో అమర్చిన ప్రత్యేక పరికరం సాయంతో మంటలు ఆరిపోయినట్లు తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాద ఘటనపై ఆరాతీశారు. ఈ క్రమంలో ఆ ఇంట్లోని సీసీ ఫుటేజీని (CCTV footage) పరిశీలించారు. ఈ క్రమంలో వంట గదిలో కుక్క చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. వంట గదిలోకి వెళ్లిన కుక్క.. అక్కడున్న (Pet dog turned on microwave) మైక్రోవేవ్‌ను ఆన్ చేసింది. మైక్రోవేవ్‌ను ఆన్ చేసి కుక్క వెళ్లిపోయిన కాసేపటికి వంటింట్లో మంటలు వ్యాపించాయి.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..


ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం జరగకుండా ఉండడంపై సదరు ఇంటి యజమానికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క విలన్‌గా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘యజమానిపై కోపంతో ఇలా చేసిందేమో’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - Jul 06 , 2024 | 04:41 PM