Share News

Viral Video: ఈ ట్రిక్ మామూలుగా లేదుగా.. విమానంలో లగేజీ చార్జి తప్పించుకోవడానికి ఇతడు చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:53 PM

విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు నిషేధిత వస్తువులను చిత్రవిచిత్ర పద్ధతుల్లో తరలిస్తే.. మరికొందరు ఏకంగా బంగారు బిస్కట్లను శరీర భాగాల్లో ...

Viral Video: ఈ ట్రిక్ మామూలుగా లేదుగా.. విమానంలో లగేజీ చార్జి తప్పించుకోవడానికి ఇతడు చేసిన నిర్వాకం..

విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు నిషేధిత వస్తువులను చిత్రవిచిత్ర పద్ధతుల్లో తరలిస్తే.. మరికొందరు ఏకంగా బంగారు బిస్కట్లను శరీర భాగాల్లో పెట్టుకుని పోలీసులకు దొరికిపోతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి విమానంలో లగేజీ చార్జి తప్పించుకోవడానికి వినూత్న ట్రిక్ వాడాడు. చివరకు అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విమాన (plane) ప్రయాణంలో లగేజీ చార్జీల (Baggage charges) నుంచి తప్పించుకోవడానికి వినూత్నంగా ఆలోచించాడు. రూపాయి చెల్లించకుండా ఎక్కువ దుస్తులను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిమిత లగేజీ మాత్రం బ్యాగులో నింపుకొని, మిగతా దుస్తులను అన్నింటినీ ఒకదానిమీద మరొకటిగా ఒంటిపై వేసుకున్నాడు. పైకి ఎలాంటి అనుమానం రాకుండా చేతిలో చిన్న బ్యాగుతో విమానంలోకి వెళ్లాడు.

Viral Video: రీల్స్ కోసం బాలిక వింత ప్రవర్తన.. స్లోమోషన్ చేసే క్రమంలో ఆమె చేసిన నిర్వాకం..


తీరా విమానంలో తన సీటు వద్దకు వెళ్లగానే ముందుగా తన చేతిలోని బ్యాగును లగేజీ ర్యాక్‌లో పెడతాడు. తర్వాత ఒక్కొక్కటిగా తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పుతూ లగేజీ ర్యాక్‌లో పడేస్తాడు. రెండు మూడు షర్ట్‌లు విప్పగానే.. ఇది మామూలే కదా అని అంతా అనుకున్నారు. కానీ అతను వరసగా ఒంటి మీద ఉన్న దుస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పేసరికి షాక్ అయ్యారు. ఇలా అతను చాలా టీషర్ట్‌లను ఒంటిపై వేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అన్ని చొక్కాలను విప్పడం కంటే.. బిల్లు చెల్లించడమే బెటరేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జలపాతం వద్ద యువకుడికి షాకింగ్ అనుభవం.. కంగారుగా బయటికి వచ్చి ఫ్యాంట్‌లో చూసుకోగా..

Updated Date - Jul 05 , 2024 | 08:53 PM