Share News

Viral Video: వామ్మో..! వీడు మామూలోడు కాదురోయ్.. మొసలి దంతాలను ఎలా వాడుకున్నాడో చూస్తే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:30 PM

పులులు, సింహాలు, మొసళ్లను చూస్తేనే ఎవరైనా గజగజా వణికిపోవాల్సిందే. పొరపాటున అవి ఎదురుపడ్డాయంటే.. ఇక ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం వీటితో చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. మరికొందరు..

Viral Video: వామ్మో..! వీడు మామూలోడు కాదురోయ్.. మొసలి దంతాలను ఎలా వాడుకున్నాడో చూస్తే..

పులులు, సింహాలు, మొసళ్లను చూస్తేనే ఎవరైనా గజగజా వణికిపోవాల్సిందే. పొరపాటున అవి ఎదురుపడ్డాయంటే.. ఇక ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం వీటితో చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. మరికొందరు వాటితో ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు వాటితో చిత్రవిచిత్ర పనులు చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలి దంతాలను ఉపయోగించిన తీరు చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో..! వీడు మామూలోడు కాదురోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఫ్లోరిడాలో (Florida) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా వారు పడవలో బీరు బాటిల్స్ కూడా పట్టుకెళ్లారు. నీటి మధ్యలోకి వెళ్లాక.. బీరు తాగాలని అనుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..


వారిలో ఓ వ్యక్తి టిన్ బీర్‌ను వినూత్నంగా ఓపెన్ చేశాడు. పడవలో పడుకుని ముందుగా నీటిలోకి తన చేతిలోని తినుబండారాన్ని విసిరేశాడు. దీంతో దాన్ని తినేందుకు నీటిలోంచి ఓ మొసలి ఉన్నట్టుండి పైకి వచ్చింది. పైకి వచ్చి నోరు తెరవగానే.. ఆ వ్యక్తి తన చేతిలోని (man opened beer with crocodile tooth) టిన్ బీరును మొసలి దంతాలకు తాకించి లాగేశాడు. దీంతో మూత ఓపెన్ అవడంతో పాటూ బీరంతా బుస్సున పొంగుతూ బయటికి వచ్చింది. ఇలా టిన్ బీరును ఓపెన్ చేసి తన స్నేహితులను సర్‌ఫ్రైజ్ చేశాడు.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..


మొసలి దంతాలతో టిన్ బోరు ఓపెన్ చేయడంతో అతడి స్నేహితులంతా కేకలు వేసుకుంటూ బీరు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడు మామూలోడు కాదురోయ్’’.. అంటూ కొందరు, ‘‘మొసలి పంటిని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Jul 05 , 2024 | 03:30 PM