Share News

Viral Video: రీల్స్ కోసం బాలిక వింత ప్రవర్తన.. స్లోమోషన్ చేసే క్రమంలో ఆమె చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 07:11 PM

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో వ్యూస్, లైక్‌ల కోసం యువతీయువకులు పడరానిపాట్లు పడుతుంటారు. అయినా చాలా మందికి సరైన లైక్స్, వ్యూస్ రావడం లేదు. దీంతో చాలా మంది ఎలాగైనా వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవడం కోసం..

Viral Video: రీల్స్ కోసం బాలిక వింత ప్రవర్తన.. స్లోమోషన్ చేసే క్రమంలో ఆమె చేసిన నిర్వాకం..

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో వ్యూస్, లైక్‌ల కోసం యువతీయువకులు పడరానిపాట్లు పడుతుంటారు. అయినా చాలా మందికి సరైన లైక్స్, వ్యూస్ రావడం లేదు. దీంతో చాలా మంది ఎలాగైనా వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవడం కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేస్తుంటారు. మరికొందరైతే విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రీల్స్ చేసే క్రమంలో ఓ బాలిక చేసిన వింత నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్లోమోషన్ ఎఫెక్ట్ కోసం ఆమె చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక (girl) సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలో మిగతా వారి కంటే భిన్నంగా స్లోమోషన్ వీడియో (Slow motion effect video) చేయాలని నిర్ణయించుకుంది. ఫోన్ స్టాండ్ పెట్టి, కెమెరా ఆన్ చేసి వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడుతుంది. అయినా ఎలాగైనా స్లోమోషన్ వీడియో చేయాలనే ఉద్దేశంతో పైకి లేచి పరుగెత్తుకుంటూ వెళ్లింది.

Viral Video: వామ్మో..! ఎర్ర చీమలతో చట్నీ.. చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


ఎదురుగా ఉన్న గోడ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి స్లోమోషన్ ఎఫెక్ట్ వచ్చేలా నడుస్తూ వచ్చింది. అయితే స్లోమోషన్ ఎఫెక్ట్ ఏమో గానీ.. ఆమె నడిచిన విధానం చూస్తుంటే నెటిజన్లను దెయ్యంలా భయపెట్టినట్లుగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పుష్ప ఫిమేల్ వర్షన్‌లా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘దెయ్యం స్లోమోషన్‌లో వస్తున్నట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘బాగా ట్రై చేశావ్.. ఇంకోసారి ట్రై చేయకు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Jul 05 , 2024 | 07:11 PM