Share News

Viral Video: జుట్టు ఆరబెట్టేందుకు ఈమె వాడిన టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:17 PM

రోజు వారీ పనులను కొందరు మిగతా వారికి భిన్నంగా చేస్తుంటారు. మరికొందరు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా మంది..

Viral Video: జుట్టు ఆరబెట్టేందుకు ఈమె వాడిన టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

రోజు వారీ పనులను కొందరు మిగతా వారికి భిన్నంగా చేస్తుంటారు. మరికొందరు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా మంది మహిళలు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. స్కూటీలో వెళ్తూ తనకు ఫోన్ కట్టేసుకుని మాట్లాడుకుంటూ వెళ్లే వారిని చూశాం. వంటింట్లో కుక్కర్‌తో చొక్కాలను ఇస్త్రీ చేసిన వారిని కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జుట్టు ఆరబెట్టేందుకు ఓ మహఇళ వాడిన టెక్నిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహిళలంతా సాధారణంగా జుట్టు ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లో చిత్రవిచిత్రంగా ఆలోచిస్తుంటారు. తాజాగా, ఓ యువతి (young woman) ఇలాగే చేసింది. తన జుట్టును ఆరబెట్టుకునేందుకు ఆమె ఏకంగా ఫ్యాన్‌ను (Standing fan) వాడుకుంది. అందరిలా ఫ్యాన్ పక్కన కూర్చోకుండా ఏకంగా స్టాండింగ్ ఫ్యాన్‌ను హెయిర్ డ్రయ్యర్ (Hair dryer) తరహాలో పట్టుకుని తన జుట్టును ఆరబెట్టుకుంది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..


హెయిర్ డ్రయ్యర్ లేకున్నా.. ఇంట్లోని స్టాండింగ్ ఫ్యాన్‌ను ఇలా డ్రయ్యర్‌లా వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.., ‘‘ఈమె చేయి పవర్ ఇది’’.., ‘‘మహిళంతా ఈమెను ఆదర్శంగా తీసుకోవాలి’’.., ‘‘హెయిర్ డ్రయ్యర్ సూపర్‌గా ఉంది’’.., ‘‘ఫ్యాన్‌ను డ్రయ్యర్‌లా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.., అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 05 , 2024 | 04:17 PM