Share News

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..

ABN , Publish Date - Jul 06 , 2024 | 09:41 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజు వారీ దినచర్యను నెటిజన్లతో పంచుకోవడం సర్వసాధారణమైంది. ఇంకొందరైతే ..

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజు వారీ దినచర్యను నెటిజన్లతో పంచుకోవడం సర్వసాధారణమైంది. ఇంకొందరైతే ఇంతటితో ఆగకుండా తమ పర్సనల్ విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటుంటారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ బెడ్‌రూం విషయాలను కూడా బయటపెట్టుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లైన దంపతులు తమ ఫస్ట్ నైట్ రోజు కూడా వ్లాగ్ స్టార్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లైన ఓ జంట (Newly married couple) తమ ఫస్ట్ నైట్ (First night) రోజు అందరికీ షాక్ ఇచ్చింది. నాలుగు గదుల మధ్యన జరగాల్సిన ఫస్ట్ నైట్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకునేందుకు సిద్ధమైంది. బెడ్రూంలో (Bedroom) అలంకరించిన మంచం వద్దకు వెళ్లిన వ్యక్తి.. ఫోన్ కెమెరా (Phone camera) ఆన్ చేశాడు. అలంకరించిన మంచాన్ని చూపించిన తర్వాత.. తన భార్యను పిలిచి నెటిజన్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

Viral Video: పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లిన యువతి.. లోపలి నుంచి వింత శబ్ధం రావడంతో.. డోరు తీసి చూడగా..


ఫోన్ కెమెరా ఆన్ చేసిన భర్త.. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఫస్ట్ నైట్ జరగబోతోంది.. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు’’.. అని ఇలా ప్రస్తావిస్తూ తన భార్యతో కూడా మాట్లాడిస్తాడు. ఆమె కూడా కెమెరా ముందు నవ్వుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలా ఎవరూ చేయని విధంగా ఫస్ట్ నైట్ రోజున వీళ్లు చేసిన వ్లాగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘వ్లాగ్స్ సాంప్రదాయం.. పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకూ చేరిందన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..

Updated Date - Jul 06 , 2024 | 09:42 PM