Share News

Viral Video: నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా.. తలుపులతో ఇతడు చేసిన ప్రయోగం చూడండి..

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:05 PM

ఇనుప వస్తువులతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసే వారిని చూస్తుంటాం. కొందరు పక్కన పడేసిన ఇనుప వస్తువులతో సరికొత్త ప్రయోగాలు చేసి వాటిని తిరిగి వాడుకలోకి తీసుకొస్తుంటారు. ఇలాంటి..

Viral Video: నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా.. తలుపులతో ఇతడు చేసిన ప్రయోగం చూడండి..

ఇనుప వస్తువులతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసే వారిని చూస్తుంటాం. కొందరు పక్కన పడేసిన ఇనుప వస్తువులతో సరికొత్త ప్రయోగాలు చేసి వాటిని తిరిగి వాడుకలోకి తీసుకొస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి నట్టు, బోల్టుతో చేసిన విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నట్టు, బోల్టుతో (NUTS AND BOLTS) విచిత్ర ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. సాధారణంగా ఎవరైనా నట్టు, బోల్టులతో రెండు వస్తువులను కలపడం చూస్తుంటాం. కానీ ఇతను మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వాటిని తలుపులకు గొల్లెంలా (doors Lock) ఉపయోగించాడు. ఇందుకోసం అతను ముందుగా స్క్రూని సగానికి కట్ చేశాడు. అందులో సగం ముక్కను ఒక తలుపునకు వెల్డింగ్ చేశాడు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. నాగుపామును ఒట్టి చేతులతో ఎలా పట్టాడో చూస్తే..


ఇంకో సగం ముక్కను రెండో తలుపునకు అతికించాడు. చివరగా రెండు డోర్స్‌ను మూసి స్క్రూకు బోల్టు బిగించాడు. ఇలా నట్టు, బోల్టుతో తలుపులకు లాక్‌లా ఏర్పాట్లు చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నట్టు, బోల్టులతో ఇలాక్కూడా వాడొచ్చా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలీదంటే ఇదేనేమో.. వెనుకే వెళ్లి చెవి దగ్గర హారన్ కొట్టగా.. చివరకు..

Updated Date - Jul 16 , 2024 | 04:57 PM