Share News

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:33 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో డబ్బులు లేకున్నా పర్లేదు.. వ్యూస్, లైక్‌లు ఉంటే చాలు అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందుకోసం కొందరు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతుంటారు. మరికొందరు...

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో డబ్బులు లేకున్నా పర్లేదు.. వ్యూస్, లైక్‌లు ఉంటే చాలు అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందుకోసం కొందరు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతుంటారు. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు బహిరంగ ప్రదేశాల్లో డాన్సులు వేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వర్షంలో రీల్ చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా వెళ్లాడు. తీరా కెమెరా ఆన్ చేసి, డాన్స్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రీల్ (Reels) చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే అందరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. వర్షంలో వినూత్నంగా డాన్స్ వేసి వైరల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందు కోసం తన ఇంటి పైకి వెళ్లి వర్షంలో ఫోన్ కెమెరాను ఆన్ చేశాడు.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..


కెమెరా ఆన్ చేసి వేగంగా వెళ్లి గింగిరాలు తిరుగుతూ డాన్స్ చేయాలని అనుకున్నాడు. అయితే ఈ క్రమంలో అత్యత్సాహంతో (man fell down while dancing in the rain) అత్యంత వేగంగా గింగిరాలు తిరగడంతో అదుపు తప్పి బోల్తా పడ్డాడు. దీంతో అతను కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ కుంటుతూ ‘‘ఈ రీల్స్ వద్దూ.. ఏమీ వద్దు.. అయ్యో’’.. అనుకుంటూ నిరాశతో ఫోన్ వద్దకు వచ్చేస్తాడు.

Viral Video: మేడపై ఇలాంటి పనులు చేస్తుంటే జాగ్రత్త.. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ఉండాలే గానీ.. మరీ ఇంతలా ఉండకూడదు’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో అయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Updated Date - Jul 18 , 2024 | 04:33 PM