Share News

Viral Video: కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..

ABN , Publish Date - Jul 17 , 2024 | 08:41 PM

సినిమాల్లో కనిపించే వివిధ రకాల సన్నివేశాలన్నీ కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. మనుషుల మధ్యే కాకుండా కొన్నిసార్లు జంతువుల మధ్య కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే...

Viral Video: కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..

సినిమాల్లో కనిపించే వివిధ రకాల సన్నివేశాలన్నీ కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. మనుషుల మధ్యే కాకుండా కొన్నిసార్లు జంతువుల మధ్య కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు కొన్ని జంతువులు మనుషులను అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క పిల్లల మధ్య ఉన్నట్టుండి డబ్ల్యూ డబ్ల్యూ తరహాలో ఫైట్ జరుగుతుంది. అక్కడే ఉన్న కోళ్లన్నీ ఈ ఫైట్‌ను చూస్తూ ఎంజాయ్ చూస్తుంటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోళ్ల ఫారంలో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. చాలా కోళ్లన్నీ ఆహారం తినేందుకు ప్లాస్టిక్ ట్రే వద్దకు వస్తాయి. అయితే అందులో ఆహారానికి బదులుగా రెండు కుక్క పిల్లలు కనిపిస్తాయి. అంతలోనే వాటి మధ్య డబ్ల్యూ డబ్ల్యూ తరహాలో (Puppies fighting) ఫైట్ మొదలవుతుంది. రెండు కుక్క పిల్లలూ ఒకదాని మరొకటి ముందుకు, వెనక్కూ తోసుకుంటూ ప్లాస్టిక్ ట్రేలో గొడవపడుతుంటాయి. కుక్క పిల్లలు పోట్లాడుకోవడం చూసి అక్కడున్న కోళ్లన్నీ షాక్ అవుతాయి.

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..


సినిమాలో ఫైట్ సీన్ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసినట్లుగా ఈ కోళ్లు కూడా (Chickens watching puppies fight) తదేకంగా చూస్తుంటాయి. పోట్లాడుకుంటున్న కుక్క పిల్లలు చివరకు ప్లాస్టిక్ ట్రే నుంచి బయటికి వచ్చి కోళ్ల మీదకు వెళ్తాయి. దీంతో అక్కడే ఉన్న ఓ కోడి పుంజు భయంతో పక్కకు వెళ్లి చూస్తుంది. మరో కోడి కుక్క పిల్లలను వారించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా.. వెంటనే మనసు మార్చుకుని.. ‘‘ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడి నుంచి పక్కకు వెళ్లిపోవడం బెటర్’’.. అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..


ఇలా కుక్క పిల్లలు చాలా సేపు పోట్లాడుకుంటూ కోళ్లకు వినోదాన్ని అందిస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోళ్లన్నీ సినిమా చూస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘కోళ్లకు టైంపాస్ బాగుందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Updated Date - Jul 17 , 2024 | 08:41 PM