Share News

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:39 PM

చావు అంటే ఎవరికైనా భయమే. చావు ముంచుకొస్తుందని తెలిస్తే ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తాం. ఈ విషయంలో మనుషులైనా, జంతువులైనా ఒకే విధంగా స్పందిస్తాయి. అయితే...

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

చావు అంటే ఎవరికైనా భయమే. చావు ముంచుకొస్తుందని తెలిస్తే ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తాం. ఈ విషయంలో మనుషులైనా, జంతువులైనా ఒకే విధంగా స్పందిస్తాయి. అయితే జంతువులకు మాటలు రాకున్నా.. ఆ భయాన్ని ఏదో రకంగా వ్యక్తం చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని జంతువులు వివిధ రకాల ఎక్స్‌ప్రెషన్లు ఇస్తుంటాయి. తాజాగా, ఓ కోడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ షాపులో తోటి కోడిని ముక్కలుగా చేయడాన్ని చూసిన మరో కోడి షాక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చికెన్ సెంటర్‌లో (Chicken Center) యథావిధిగా కోడి మాంసాన్ని కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దుకాణదారుడు కోడి (chicken) మాంసాన్ని కట్ చేస్తుండగా.. ఈ ఘటనను మొత్తం పక్కనే ఇనుప పంజరంలో ప్రాణంతో (chicken is watching) ఉన్న కోడి గమనిస్తుంటుంది.

Viral Video: మేడపై ఇలాంటి పనులు చేస్తుంటే జాగ్రత్త.. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..


ఈ సమయంలో అది ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అందరి హృదయాలనూ కదిలిస్తో్ంది. అప్పటిదాకా తనతో ఉన్న కోడి అంతలోనే ముక్కలు ముక్కలు కావడాన్ని చూసి ఆ కోడికి భయం మొదలైనట్లుంది. అయితే ఎటూ పోలేని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కోడి అలాగే చూస్తుండిపోయింది. ‘‘అయ్యో.. నా స్నేహితుడిని చంపేశారే.. కాసేపు ఉంటే నన్ను కూడా చంపేస్తారే.. ఇప్పుడు నేను ఏం చేయాలి.. అయ్యా.. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండయ్యా’’.. అన్నట్లుగా ఆ కోడి (Expressions) ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: వర్షం రావడంతో పెళ్లి మంటపం నుంచి పారిపోయిన అతిథులు.. అయినా వరుడు మాత్రం వేదికపై నిలబడి..


ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వారు తమ ఫోన్‌తో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ కోడిని చూస్తే బాధేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ సీన్ చూస్తుంటే.. కోళ్లను తినాలంటే మనసు రావట్లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..

Updated Date - Jul 17 , 2024 | 05:39 PM