Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ABN , Publish Date - Jul 18 , 2024 | 08:49 PM
చాలా మంది వ్యూస్, లైక్‌ల కోసం విచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఎవరూ చేయలేని సాహసాలు చేస్తుంటే.. మరికొందరు ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ...
చాలా మంది వ్యూస్, లైక్‌ల కోసం విచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఎవరూ చేయలేని సాహసాలు చేస్తుంటే.. మరికొందరు ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసళ్లు ఉన్న సరస్సులోకి బైకుతో దూసుకెళ్లాడు. అలాగే కారులో కూడా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) ఆల్వార్ జిల్లా సిలిసెహర్ మొసళ్ల పార్క్‌లో చోటు చేసుకుంది. 300 మొసళ్లు ఉన్న ఓ సరస్సులో (Crocodile Lake) కొందరు ఆకతాయిలు ప్రమాదకర విన్యాసాలు చేశారు. ముందుగా ఓ యువకుడు బైకులో (bike) సరస్సులోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపుతప్పి నీటిలో పడిపోయినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
Viral Video: విసిగిస్తోందని కాకిని కట్టేశాడు.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్..
ఇలా నీటిలోకి దిగిన అతను.. వేగంగా ఒడ్డుకు చేరుకుంటాడు. అంతటితో ఆగని వారు కారులో కూడా నీటిలోకి దిగి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఓ కారు, ఏడు బైకులతో పాటూ 20 మంది యువకులను అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రదేశాల్లో ఇలా విన్యాసాలు చేసి, వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Viral Video: పందిపై పులి దాడి.. మధ్యలో ఎంటరైన భారీ మొసలి.. చివరకు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. అంతా వేడుక చూస్తుండగా.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..