Share News

Viral Video: యువతికి షాకింగ్ లవ్ ప్రపోజల్.. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూస్తే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:26 PM

యువతీయువకులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునే క్రమంలో వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. కొందరు సినిమా సీన్ తరహాలో లవ్ ప్రపోజ్ చేస్తే.. మరికొందరు...

Viral Video: యువతికి షాకింగ్ లవ్ ప్రపోజల్.. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూస్తే..

యువతీయువకులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునే క్రమంలో వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. కొందరు సినిమా సీన్ తరహాలో లవ్ ప్రపోజ్ చేస్తే.. మరికొందరు బలవంతంగా ప్రపోజ్ చేస్తూ బెదిరించి మరీ యువతలను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు యువతికి లవ్ ప్రపోజల్ చేసి షాక్ ఇచ్చాడు. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఓ అమ్మాయిని తీసుకుని బ్రిడ్జిపైకి వెళ్లాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జి మధ్యలోకి వెళ్లిన తర్వాత సదరు యువకుడు ఆమెకు లవ్ ప్రపోజల్ చేశాడు. దీంతో షాకైన యువతి.. తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి బ్రిడ్జి రెయిలింగ్ పైకి ఎక్కి రోప్ పట్టుకుని కిందకు దూకేస్తా అంటూ బెదిరించాడు.

Viral Video: గుండె దడ పుట్టించే సీన్.. కొండ అంచున్న బైక్ రైడ్.. చూస్తుండగానే..


అతను చేసిన ఈ పనికి ఆమె షాక్ అయింది. ప్లీజ్ కార్తీక్ అలా చేయకు.. అంటూ వేడుకుంది. లవ్ ప్రపోజల్ (Love proposal) ఒకే చేస్తేనే కిందకు దిగుతానంటూ అతను కండీషన్ పెట్టాడు. దీంతో భయపడిపోయిన యువతి.. చివరకు ఆతడి లవ్ ప్రపోజల్‌ను ఓకే చేసింది. ఇలా ఆ యువకుడు ఆమెను బెదిరించి మరీ లవ్ ప్రపోజ్ చేశాడు.

Viral Video: వేట కోసం చెట్టుపై సింహం, చిరుత భీకర పోరు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల యాక్టింగ్ మరీ ఓవర్‌గా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయ్యాడేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 20 , 2024 | 08:26 PM