Share News

Viral Video: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:51 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పొలం పనులు చేసే వారి దగ్గర నుంచి ఆఫీసులో ఫైళ్లు తిరగేసే వారి వరకూ చాలా మంది రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. కొందరైతే ఓ వైపు తమ పని చేస్తూనే ఇంకోవైపు రీల్స్ చేస్తూ...

Viral Video: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పొలం పనులు చేసే వారి దగ్గర నుంచి ఆఫీసులో ఫైళ్లు తిరగేసే వారి వరకూ చాలా మంది రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. కొందరైతే ఓ వైపు తమ పని చేస్తూనే ఇంకోవైపు రీల్స్ చేస్తూ నెటిజన్లతో తమ అనుభవాలను పంచుకుంటుంటారు. ఇంకొందరు ఏవేవో ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు మహిళలు హైహీల్స్‌తో వ్యవసాయం చేయడం చూసి నెటిజన్లు అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతగా.. ‘‘ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు (women) పొలంలో విత్తనాలు నాటేందుకు వెళ్లారు. అయితే ఆ పనిని కాస్త వినూత్నంగా చేసి, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని అనుకున్నట్లున్నారు. అందుకు తగ్గట్టుగా ఎవరూ ఆలోచించని విధంగా హైహీల్స్ చెప్పులతో (High heels sandals) విత్తనాలు నాటాలని డిసైడ్ అయ్యారు.

Viral Video: ఈ కారును చోరీ చేయడం ఎవరి తరమూ కాదు.. యజమాని ఏర్పాట్లు చూస్తే.. షాకవడం ఖాయం..


ఓ మహిళ హైహీల్స్ చెప్పులు తొడిగి మట్టిలో నడుస్తుంటే.. వాటి కారణంగా మట్టిలో ఏర్పడిన చిన్నపాటి రంధ్రంలో మరో మహిళ విత్తనాలు (seeds) పూడుస్తోంది. ఇలా ఆమె నడుస్తూ వెళ్తుంటే.. మరో మహిళ వెనుక విత్తనాలు నాటుతూ వెళ్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మహిళల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 20 , 2024 | 05:08 PM