Share News

Viral Video: వేట కోసం చెట్టుపై సింహం, చిరుత భీకర పోరు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:51 PM

అడవికి రాజు సింహమే అయినా చాలా సార్లు వీటికి కూడా పరాభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నోటివరకూ వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి ..

Viral Video: వేట కోసం చెట్టుపై సింహం, చిరుత భీకర పోరు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

అడవికి రాజు సింహమే అయినా చాలా సార్లు వీటికి కూడా పరాభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నోటివరకూ వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా.. సింహం, చిరుతకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వేట కోసం చెట్టుపై సింహం, చిరుత మధ్య భీకర పోరు జరుగుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుతపులి వేటను నోట కరచుకుని చివరకు ఓ చెట్టు పైకి చేరుకుంటుంది. అయితే అదే సమయంలో ఆకలితో ఉన్న ఓ సింహం.. చిరుతను గమనిస్తుంది. ఎలాగైనా ఆ వేటను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. వేగంగా చెట్టుపైకి ఎక్కేస్తుంది. సింహాన్ని చూసిన చిరుత వేటను తీసుకుని చెట్టు కొమ్మ అంచుకు చేరుకుంటుంది.

Viral Video: ఈ కారును చోరీ చేయడం ఎవరి తరమూ కాదు.. యజమాని ఏర్పాట్లు చూస్తే.. షాకవడం ఖాయం..


అయినా వదలని సింహం.. వేటను ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో సింహం, చిరుత (fight between lion and leopard on tree) మధ్య యుద్ధం మొదలవుతుంది. చాలా సేపు ఆ రెండూ పోట్లాడుకుంటాడు. అయితే ఈ క్రమంలో అంచుకు చేరుకోవడంతో బరువు ఎక్కువై కొమ్మ విరుగుతుంది. దీంతో సింహం, చిరుత ఒకేసారి ధబేల్‌మని కిందపడిపోతాయి. ఆ వెంటనే తేరుకున్న చిరుత అక్కడి నుంచి పరారవుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. వీటి పోట్లాట చాలా భయంకరంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వేట కోసం ఇలాంటి యుద్ధాలు మామూలే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 20 , 2024 | 04:51 PM