Share News

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jul 21 , 2024 | 08:10 PM

ఇళ్లల్లో ఈగలు, బల్లులు, బొద్దింకల బెదడతో కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వివిధ రకాల స్ప్రేలు కొడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు...

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

ఇళ్లల్లో ఈగలు, బల్లులు, బొద్దింకల బెదడతో కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వివిధ రకాల స్ప్రేలు కొడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బల్లిని తరమికొట్టేందుకు స్ప్రే బాటిల్ తీసుకుని వెళ్లింది. అయితే తలుపు తీసి చూడగానే ఒక్కసారిగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) ఇంట్లో ఉండగా ఆమెకు తలుపు వద్ద ఓ బల్లి (lizard) కనిపిస్తుంది. ఆ వెంటనే అది తలుపు చాటుకు వెళ్తుంది. బల్లిని ఇంట్లో నుంచి తరమికొట్టేందుకు ఆమె స్ప్రే (Spray) బాటిల్ తీసుకుని తలుపు వద్దకు వెళ్తుంది. స్ప్రే కొట్టేందుకు తలుపు తీసి చూడగా అక్కడ చాలా బల్లులు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఆమె భయంతో వణికిపోతుంది. వామ్మో.. అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ఇదెక్కడి కేక్ కటింగ్‌రా అయ్యా.. ఇతను చేసిన పని చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ బల్లి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చినట్లుంది’’.., ‘‘యువతికి షాక్ ఇచ్చిన బల్లులు’’.., ‘‘వాటిని ఒంటరిగా వదిలేయండి’’..., ‘‘హారర్ సినిమా చూసినట్లుంది ఉంది’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..

Updated Date - Jul 21 , 2024 | 08:10 PM