Share News

Viral Video: ఇదెక్కడి కేక్ కటింగ్‌రా అయ్యా.. ఇతను చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:42 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెకన్‌కు ఒకరు, నిముషానికి ఒకరు నెట్టింట్లో ఇట్టే వైరల్ అయిపోతున్నారు. కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వీరిని చూసి మిగతా వారు ఎలాగైనా..

Viral Video: ఇదెక్కడి కేక్ కటింగ్‌రా అయ్యా.. ఇతను చేసిన పని చూస్తే..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెకన్‌కు ఒకరు, నిముషానికి ఒకరు నెట్టింట్లో ఇట్టే వైరల్ అయిపోతున్నారు. కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వీరిని చూసి మిగతా వారు ఎలాగైనా.. నెటిజన్ల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఏవేవో పిచ్చి పిచ్చి పనునల్నీ చేసేస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి కేక్ కట్ చేసిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎవరైనా పుట్టిన రోజు నాడు కేక్‌ను కట్ చేస్తుంటారు. కేక్‌ను ఎవరైనా కత్తితోనే కట్ చేస్తుంటారు. అయితే ఈ యువకుడు మాత్రం సాధారణానికి భిన్నంగా చేసి, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని అనుకున్నట్టున్నాడు.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..


కేక్‌ను మంచంపై పెట్టి, కత్తితో కాకుండా ఏకంగా తుపాకీతో కట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓ పెద్ద తుపాకీ తీసుకుని, అందులో బుల్లెట్ నింపాడు. తర్వాత మంచంపై (man shot the cake with gun) ఉన్న కేక్‌కు గురి పెట్టి కాల్చేశాడు. దీంతో ఆ కేక్ మొత్తం ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇదిలావుండగా, ఈ వీడియో చివరకు ఘజియాబాద్‌ పోలీసుల వరకూ వెళ్లింది.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..


ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచాణకు ఆదేశించారు. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘గన్ సాంప్రదాయం చాలా డేంజర్.. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..

Updated Date - Jul 21 , 2024 | 05:42 PM