Share News

Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:30 PM

కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. కొందరు పాత వస్తువులతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఇళ్లల్లోని కూలర్లు, ఫ్రిడ్జిలు, ఫ్యాన్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ...

Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. కొందరు పాత వస్తువులతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఇళ్లల్లోని కూలర్లు, ఫ్రిడ్జిలు, ఫ్యాన్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి ఐడియాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్ వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని ఓ గదిలో ఏసీని అమర్చాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతను ఏసీని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కింద ఫ్లోర్‌లో ఏసీని ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి.. పై అంతస్తులో కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే దానికి మళ్లీ ఇంకో ఏసీని కొనే పని లేకుండా.. ఉన్న ఏసీతోనే సరిపెట్టాలని భావించాడు.

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..


ఇందుకోసం చివరకు విచిత్రమైన ప్రయోగం చేశాడు. ఏసీ ఉన్న గదికి, పై అంతస్తులోని గది మధ్య రంధ్రం ఏర్పాటు చేశాడు. ఆ రంధ్రానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Exhaust fan) బిగించాడు. ఆ ఫ్యాన్ తిరగడం ద్వారా ఏసీ ఉన్న గదిలోని చల్లదనం పైఅంతస్తులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. ఇలా ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో (Cooling on two floors with one AC) చల్లదనం వచ్చేలా ప్రయోగం చేశాడు.

Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

Updated Date - Jul 21 , 2024 | 09:41 PM