Share News

Viral Video: రోడ్డుపై జలపాతం కింద బైకర్ల స్నానాలు.. లారీ హారన్ కొట్టడంతో.. పదే పదే అడిగి మరీ..

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:02 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకుల ప్రవర్తన రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. కొందరు లైక్‌లు, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు...

Viral Video: రోడ్డుపై జలపాతం కింద బైకర్ల స్నానాలు.. లారీ హారన్ కొట్టడంతో.. పదే పదే అడిగి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకుల ప్రవర్తన రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. కొందరు లైక్‌లు, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి సంబరపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై జలపాతం కింద స్నానాలు చేస్తున్న యువకులు.. లారీ హారన్ కొట్టడంతో ఏం చేశారో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది బైకర్లు (Bikers) రోడ్డుపై జలపాతం కింద స్నానాలు చేస్తుంటారు. దీంతో కొందరు తమ వాహనాలను రోడ్డుపై నిలిపేసి వారిని గమనిస్తుంటారు. ఈ క్రమంలో కొద్ది సేపటికి ఓ మినీ లారీ (lorry) అక్కడికి వస్తుంది. యువకులు రోడ్డుకు అడ్డుగా ఉండడం చూసి డ్రైవర్ హారన్ కొడతాడు.

Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..


అయితే ఆ హారన్ చిత్ర విచిత్రంగా మ్యూజిక్ తరహాలో రావడంతో.. యువకుతలంతా కలిసి ఆ హారన్ సౌండ్‌కు (Youth danced to Lorry Haron) అనుగుణంగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. హారన్ ఆపడంతో.. వారంతా డ్రైవర్‌ను అడిగిమరీ హారన్ కొట్టించుకుంటూ డాన్స్ వేస్తుంటారు. ఇలా కొద్దిసేపటి తర్వాత డ్రైవర్‌కు విసుగొచ్చి వాహనాన్ని ముందుకు పోనిస్తాడు. దీంతో చివరకు ఆ యువకులంతా డాన్స్ ఆపి పక్కకు వెళ్లిపోతారు.

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరేంటీ మరీ విచిత్రంగా ఉన్నారే’’.. అంటూ కొందరు, ‘‘లారీ హారన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

Updated Date - Jul 21 , 2024 | 09:02 PM