Share News

Viral Video: మేడపైన ఆంటీని ఇంప్రెస్ చేయడానికి అంకుల్ విశ్వప్రయత్నం.. నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:12 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేడానికి అబ్బాయిలు వివిధ రకాల వీడియోలు చేస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు భార్యల ను మెప్పించడానికి భర్తలు కూడా వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: మేడపైన ఆంటీని ఇంప్రెస్ చేయడానికి అంకుల్ విశ్వప్రయత్నం.. నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేడానికి అబ్బాయిలు వివిధ రకాల వీడియోలు చేస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు భార్యల ను మెప్పించడానికి భర్తలు కూడా వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తన భార్యను ఇంప్రెస్ చేయడానికి వినూత్నంగా డాన్స్ వేశాడు. ఇతడి డాన్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మేడపై ఉన్న తన భార్యను (wife) ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. బాలీవుడ్ హీరో గోవిందా (Bollywood hero Govinda song) పాటను ప్లే చేసి, దానికి అనుగుణంగా స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశాడు. ‘‘నీచే ఫూలోన్ కి దుకాన్, ఊపర్ గోరీ కా మకాన్’’.. అనే గోవిందా పాటకు లయబద్ధంగా అడుగులు వేస్తూ అతడు వేసిన డాన్స్ చూసి మేడ పైన ఉన్న భార్య నవ్వుతూ బదులిచ్చింది. ఆమె కూడా కూర్చునే డాన్స్ (dances) వేస్తూ తన భర్తను మరింతలా ఎంకరేజ్ చేసింది.

Viral Video: కాలు జారి జలపాతంలో పడ్డ యువకుడు.. అంతెత్తునుంచి కొట్టుకొచ్చినా..


ఇలా చాలా సేపు అతను గోవిందా తరహాలోనే డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అమేజింగ్ డాన్స్ మూమెంట్స్’’.., ‘‘మీ జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి’’.., ‘‘అంకుల్‌జీ.. మొదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి’’.., ‘‘ఎంతో బాగా డాన్స్ చేస్తున్నారు’’.., ‘‘ఈ వయసులోనూ ఇలా డాన్స్ చేయడం గ్రేట్’’.. అంటూ కొందరు ఇలా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: లక్ అంటే ఇదేనేమో.. 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి.. చూస్తుండగానే.. ఆశ్చర్యకరంగా..

Updated Date - Jul 23 , 2024 | 08:12 PM