Share News

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:44 PM

వివాహ సమయాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. వివాహ తంతు ముగిసే లోపు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ వివాహ సవ్యంగా జరిగినా భార్యాభర్తల మధ్య నెలల వ్యవధిలో ...

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..
ప్రతీకాత్మక చిత్రం

వివాహ సమయాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. వివాహ తంతు ముగిసే లోపు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ వివాహ సవ్యంగా జరిగినా భార్యాభర్తల మధ్య నెలల వ్యవధిలో అనేక రకాల గొడవలు తలెత్తి చివరకు విడాకులు తీసుకునే వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగిన మూడు నిముషాల్లోనే దంపతులు విడాకులు తీసుకునే వరకూ వెళ్లింది. అసలేం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కువైట్‌లో (Kuwait) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువకుడికి, ఇదే ప్రాంతానికి చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఇటీవల ఓ రోజ వారి వివాహానికి (marriage) ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతిథులందరి సమక్షంలో వారి వివాహ వేడుక కూడా అంతే వైభవంగా జరిగింది.

Viral Video: లక్ అంటే ఇదేనేమో.. 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి.. చూస్తుండగానే.. ఆశ్చర్యకరంగా..


ఇంతవరకూ అంతా సవ్యంగా జరిగింది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. వివాహ తంతు ముగిసిన తర్వాత వధూవరులు నడుస్తూ వెళ్తండగా.. వధువు పొరపాటున కాలి జారి కిందపడింది. దీంతో వరుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఇడియట్.. అంటూ ఏవేవో మాట్లాడుతూ హేళన చేశాడు. దీంతో వధువు కిందపడిన దానికంటే.. వరుడి మాటలకు అవమానంగా ఫీలైంది. కిందపడిన తనను పైకి లేపాల్సింది పోయి.. విరుద్ధంగా ఎగతాళి చేస్తావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Viral Video: మేడపైన ఆంటీని ఇంప్రెస్ చేయడానికి అంకుల్ విశ్వప్రయత్నం.. నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..


ఇలాంటి భర్త నాకు వద్దంటూ భీష్మించుకుంది. వెంటనే తనకు విడాకులు (Divorce) కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈమె సమస్య విని జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు. అయితే చేసేదిలేక చివరకు విడాకులు మంజూరు చేయాల్సి వచ్చింది. పెళైన మూడు నిముషాల్లోనే విడాకులు తీసుకోవడం కువైట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వధువుకు మద్దతుగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు.. ఇంత చిన్న విషాయానికి విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..

Updated Date - Jul 23 , 2024 | 08:44 PM