Share News

Viral Video: అయ్యో పాపం.. పాము నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ తల్లి పక్షి తపన చూస్తే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 06:01 PM

తల్లి ప్రేమకు మించినది ప్రపంచంలో మరోటి లేదనడంలో అతిశయోక్తి లేదు. పిల్లలకు ప్రాణహాని ఉందని తెలిస్తే.. తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి రక్షించుకుంటుంది తల్లి. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా...

Viral Video: అయ్యో పాపం.. పాము నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ తల్లి పక్షి తపన చూస్తే..

తల్లి ప్రేమకు మించినది ప్రపంచంలో మరోటి లేదనడంలో అతిశయోక్తి లేదు. పిల్లలకు ప్రాణహాని ఉందని తెలిస్తే.. తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి రక్షించుకుంటుంది తల్లి. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. మనుషులకంటే జంతువుల, పక్షుల్లోనే ప్రేమ ఇంకా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి పక్షి పడిన తపన చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కెనడాలోని (Canada) అల్బెర్టాలోని డైనోసార్ ప్రొవిన్షియల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ పాము.. చెట్టు పైకి ఎక్కి ఆహారం కోసం వెతుకుతుంటుంది. ఇంతలో దానికి పక్షి గూడు తారసపడుతుంది. వెంటనే అందులోకి దూరి పక్షి పిల్లలను (Snake attack on baby birds) తినే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: లిఫ్ట్‌లో షాకింగ్ అనుభవం.. డోరు తెరుచుకున్నా దిగలేక అవస్థలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అయితే కాసేపటికి దీన్ని గమనించిన తల్లి పక్షి వేగంగా అక్కడికి వస్తుంది. గూడులోకి వెళ్లిన పామును తరిమే ప్రయత్నం చేస్తుంది. తన ముక్కుతో పదే పదే పామును పొడుస్తుంది. అయితే ఈ క్రమంలో పాము పక్షిపై దాడి చేస్తుంది. పక్షిని గట్టిగా పట్టుకోవడంతో రెండూ కలిసి పైనుంచి కిందపడతాయి. కిందపడ్డాక కూడా చాలా సేపు ఆ పాము పక్షిని పట్టుకునే ఉంటుంది. అయితే ఆ తర్వాత పాము పక్షిని వదిలేసినట్లు వీడియో షేర్ చేసిన వారు ప్రస్తావించారు.

Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..


అప్పటికే ఆ పాము కొన్ని పక్షి పిల్లలను చంపి తినిందని, ఆకలి తీరిపోవడంతోనే తల్లి పక్షిని వదిలేసిందని పేర్కొన్నారు. కాగా, పిల్లలను కాపాడుకునేందుకు తల్లి పక్షి పడిన తపన చూపరుల గుండెలను పిండేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ తల్లి పక్షికి ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

Updated Date - Jul 24 , 2024 | 06:01 PM