Share News

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:34 PM

ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఏ వస్తువు కావాలన్నా ఒక్క క్లిక్‌తో నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్‌లైన్ ఆర్డర్లకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. కొన్నిసార్లు...

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఏ వస్తువు కావాలన్నా ఒక్క క్లిక్‌తో నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్‌లైన్ ఆర్డర్లకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. కొన్నిసార్లు ఇలాంటి ఆర్డర్లు చేసే సమయంలో ఊహించని సమస్యలు కూడా వచ్చిపడుతుంటాయి. ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకో వస్తువు రావడం, కొన్నిసార్లు అయితే వస్తువుకు బదులుగా రాళ్లు, చెత్తాచెదారం వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్తకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తనకు వచ్చిన అమెజాన్ పార్సిల్ ఓపెన్ చేసి చూడగా.. అందులో షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వార్తకు సంబంధించిన ఫొటో (Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొలంబియాకు (Colombia) చెందిన సోషియా అనే యువతి ఇటీవల అమెజాన్‌లో (Amazon) ఎయిర్‌ఫ్రైయర్‌ను (air fryer) ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టిన గంటల వ్యవధిలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తనకు వచ్చిన పార్సిల్‌ను తీసుకున్న యువతి.. దాన్ని ఎంతో ఆతృతగా ఓపెన్ చేసింది.

Viral Video: లిఫ్ట్‌లో షాకింగ్ అనుభవం.. డోరు తెరుచుకున్నా దిగలేక అవస్థలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అయితే అందులో ఎయిర్‌ఫ్రైయర్‌కు బదులుగా పెద్ద బల్లి (massive lizard in Amazon parcel) ఉండడం చూసి ఖంగుతింది. వెంటనే గట్టిగా కేకలు వేస్తూ ఆ బాక్సును పక్కన విసిరేసింది. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత దాన్ని ఫొటో తీసి, తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పార్సిల్ చేసే సమయంలో కంపెనీ సిబ్బంది పొరపాట్లు చేశారా.. లేక మధ్యలో ఇలా జరిగిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Viral Video: యువతి సోఫాలో పడుకుని ఉండగా.. సడన్‌గా సమీపానికి వచ్చిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


కాగా, ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘అరే.. ఇదెలా సాధ్యం’’.. అంటూ మరికొందరు, ‘‘కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పోస్టు ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..

Updated Date - Jul 24 , 2024 | 04:34 PM