Share News

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:47 PM

విష సర్పం ఒక్కసారి కాటేసిందంటే చాలు.. అది మనిషి అయినా, జంతువు అయినా దాదాపు చావుకు దగ్గరపడ్డట్లే. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే కొన్నిసార్లు పాములతో కొన్ని జంతువులు, మరికొన్ని జీవులు..

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..

విష సర్పం ఒక్కసారి కాటేసిందంటే చాలు.. అది మనిషి అయినా, జంతువు అయినా దాదాపు చావుకు దగ్గరపడ్డట్లే. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే కొన్నిసార్లు పాములతో కొన్ని జంతువులు, మరికొన్ని జీవులు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో పలుమార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాముకు, జెర్రికి మధ్య పవర్‌ఫుల్ ఫైట్ జరిగింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆహారం వెతుకుతున్న పాముకు ఓ కాళ్ల జెర్రి కనిపిస్తుంది. జెర్రి కూడా ఆహారం కోసం వెతుకుతూ పాము కంటపడుతుంది. జెర్రిని చూడగానే పాము ఒక్కసారిగా (Snake attack on centipede) దాడికి దిగుతుంది. జెర్రిని కాటేసి చంపేయాలని చూస్తుంది. అయితే పాము దాడి చేయగానే జెర్రి వెంటనే అలెర్ట్ అవుతుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..


వెంటనే పాముపై ఎదురుదాడికి దిగుతుంది. పాము పదే పదే కాటు వేసినా జెర్రికి ఏమీ కాదు. చివరకు పాము తలలో నాలుకను పట్టేసుకుంటుంది. పాము నాలుకను గట్టిగా కొరికి పట్టుకుటుంది. దంతో పాము కుయ్యో.. మొర్రో అనుకుంటూ విలవిల్లాడిపోతుంది. జెర్రి కాటు నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే జెర్రి మాత్రం పామును వదలకుండా అలాగే చాలా సేపు గట్టిగా పట్టుకుని కొరికేస్తుంటుంది. ఇలా వాటి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో సరసాలు ఆడుతున్న కూతురు.. ఉన్నట్టుండి ఆమె తండ్రి లోపలికి రావడంతో..


ఈ ఘటన చూస్తుంటే జెర్రి చేతిలో పాము తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జెర్రి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాము జెర్రితో అనవరంగా పెట్టుకుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 71వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Jul 25 , 2024 | 08:47 PM