Share News

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న కూతురు.. ఉన్నట్టుండి ఆమె తండ్రి లోపలికి రావడంతో..

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:25 PM

ప్రేమికుల ప్రవర్తన రోజురోజుకూ హద్దుమీరిపోతోంది. కొందరు బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇళ్లల్లో పాడు పనులు ఆడుతూ చివరకు కుటుంబ సభ్యులకు దొరికిపోతున్నారు. ఈ క్రమంలో ..

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న కూతురు.. ఉన్నట్టుండి ఆమె తండ్రి లోపలికి రావడంతో..

ప్రేమికుల ప్రవర్తన రోజురోజుకూ హద్దుమీరిపోతోంది. కొందరు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇళ్లల్లో పాడు పనులు చేస్తూ చివరకు కుటుంబ సభ్యులకు దొరికిపోతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉండగా.. ఆమె తండ్రి సడన్‌గా లోపలికి వచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ (young woman dancing with her boyfriend) డాన్స్ చేస్తూ కనిపించారు. ఇలా వారిద్దరూ సరాదాగా గడుపుతుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. యువతి తండ్రి సడన్‌గా లోపలికి వస్తాడు. వచ్చీరాగానే కూతురు వేరే యువకుడితో ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక.. వచ్చీ రాగానే సదరు యువకుడి తలపై గట్టిగా కొడతాడు.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..


ఆ తర్వాత అంతే కోపంతో తన కూతురుపై (Father assaults daughter) కూడా దాడికి పాల్పడతాడు. దీంతో ఆ యువకుడు ఆమెను విడిపించే ప్రయత్నం చేస్తాడు. దీంతో తండ్రి కూతురుతో పాటూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కూడా దాడికి పాల్పడతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె నిర్వాకం మరీ దారుణంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘తండ్రి చేసింది కరెక్టే’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Aug 02 , 2024 | 06:41 PM