Share News

Viral Video: ఐకమత్యం అంటే ఇదీ.. పాము నుంచి స్నేహితుడిని కాపాడేందుకు ఈ కుక్క పిల్లలు చేసిన కృషి చూస్తే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:24 PM

‘‘ఐకమత్యమే మహా బలం’’.. అని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎవరికి వారే యుమునా తీరే.. అన్న చందంగా తయారైంది. సాటి మనిషి ఏమైపోయినా మాకు పర్లేదు.. అన్న రీతిలోనే...

Viral Video: ఐకమత్యం అంటే ఇదీ.. పాము నుంచి స్నేహితుడిని కాపాడేందుకు ఈ కుక్క పిల్లలు చేసిన కృషి చూస్తే..

‘‘ఐకమత్యమే మహా బలం’’.. అని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎవరికి వారే యుమునా తీరే.. అన్న చందంగా తయారైంది. సాటి మనిషి ఏమైపోయినా మాకు పర్లేదు.. అన్న రీతిలోనే చాలా మంది వ్యవహారం ఉంటోంది. సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఐకమత్యం లేని ఈ రోజుల్లో జంతువులను చూసి జనం చాలా నేర్చుకోవాలి. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాము నుంచి తమ సహచరుడిని కాపాడునేందుకు కుక్క పిల్లలన్నీ దాంతో ఫైట్ చేశాయి. చివరికి ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లకు ఉన్నట్టుండి ఓ పాము తారసపడుతుంది. కుక్క పిల్లను చూడగానే (Snake attack on puppy) పాము బుసలు కొడుతూ దాడి చేస్తుంది. చివరికి కుక్క పిల్లను చుట్టేసి చంపేసేందుకు ప్రయత్నిస్తుంది. పాము నుంచి విడిపించుకోవడానికి కుక్క పిల్ల ఎంతో ప్రయత్నిస్తుంది. అయినా దాని వల్ల సాధ్యం కాదు.

Viral Video: వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో అందరికీ షాక్ ఇస్తూ..


ఇంతలో సమీపంలో ఉన్న కుక్క పిల్లలు ఇదంతా గమనిస్తాయి. వెంటనే తమ సహచరుడిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాయి. పామును గట్టిగా పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తాయి. అయినా పాము కుక్క పిల్లను వదలంకుండా పట్టుకుని ఉంటుంది. దీంతో కుక్క పిల్లలన్నీ చుట్టూ చేరి పామును పట్టుకుని బలంగా పక్కకు లాగేస్తాయి. ఇలా చివరకు ఎలాగోలా పామును పక్కకు లాగి తమ స్నేహితుడిని రక్షించుకుంటాయి. ఆ తర్వాత మూడు కుక్క పిల్లలూ కలిసి (Puppies attacked the snake) పామును ఒక ఆట ఆడుకుంటాయి.

Viral Video: పొట్టకూటి కోసం పామును ఇబ్బంది పెట్టలేక.. రోడ్డుపై వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


ఇలా కుక్క పిల్లలన్నీ కలిసి పామును కొరికి కొరికి తమ కోపం మొత్తం చల్లార్చుకుంటాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క పిల్లల ఐకమత్యం చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వీటిని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 26 , 2024 | 06:24 PM