Share News

Viral Video: ఇదెక్కడి ఐడియారా అయ్యా.. బైకును బస్సులా మార్చాడే.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:13 PM

చాలా మంది పాత వాహనాలపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సైకిళ్లను బైకుల్లా, మరికొందరు బైకును ఆటోల్లా.. ఇంకొదంరు ఆటోలను కార్ల తరహాలో మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి..

Viral Video: ఇదెక్కడి ఐడియారా అయ్యా.. బైకును బస్సులా మార్చాడే.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..

చాలా మంది పాత వాహనాలపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సైకిళ్లను బైకుల్లా, మరికొందరు బైకును ఆటోల్లా.. ఇంకొదంరు ఆటోలను కార్ల తరహాలో మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైక్‌కు బస్సు గేర్ అమర్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన పాత బైకును వినూత్నంగా తయారు చేసి నెట్టింట వైరల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం చాలా తెలివిగా ఆలోచించి, చివరకు తన బైక్‌కు బస్సు (Bus gear fitted to the old bike) గేర్ అమర్చాలని ఫిక్స్ అయ్యాడు. తన పాత బైక్‌ గేర్‌కు బస్సు గేర్ రాడ్‌ను అతికించాడు.

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..


బైక్ గేర్ ముందు వైపు ఈ బస్సు గేర్‌ను వెల్డింగ్ చేసి ఫిక్స్ చేశాడు. బైక్ రన్నింగ్‌లో ఉండగా.. కాలితో గేర్ వేసే పని లేకుండా.. బస్సు తరహాలో గేర్‌ను చేత్తో వేసేలా ఏర్పాట్లు చేశాడు. ఇతడి వినూత్న ప్రయోగం (innovative experiment) చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో సరసాలు ఆడుతున్న కూతురు.. ఉన్నట్టుండి ఆమె తండ్రి లోపలికి రావడంతో..


దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘బైక్‌కు బస్సు గేర్.. ఐడియా అదుర్స్’’.., ‘‘బహుశా.. ఇతడి కుడికాలు పనిచేయలేదేమో’’.., ‘‘బైక్ నడపాలనే వికలాంగులకు ఇది ఉపయోగపడుతుంది’’.., ‘‘ఈ కళాకారుడికి ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువే’’.., ‘‘నేను ఇంజినీరింగ్ చదివి వేస్ట్’’.., ‘‘ఈ బైక్‌లో వెళ్లడం అంటే నరకంలోకి వెళ్లడమే’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Jul 25 , 2024 | 09:13 PM