Share News

Viral Video: వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో అందరికీ షాక్ ఇస్తూ..

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:07 PM

కొందరు చూడ్డానికి మాత్రమే చిన్న పిల్లల్లా కనిపిస్తుంటారు. కానీ వారు చేసే పనులు చూస్తే పెద్దవాళ్లు కూడా షాక్ అయ్యేలా ఉంటాయి. కొందరు పిల్లలైతే పెద్దలు కూడా చేయని విధంగా అనేక విన్యాసాలు చేస్తుండడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో అందరికీ షాక్ ఇస్తూ..

కొందరు చూడ్డానికి మాత్రమే చిన్న పిల్లల్లా కనిపిస్తుంటారు. కానీ వారు చేసే పనులు చూస్తే పెద్దవాళ్లు కూడా షాక్ అయ్యేలా ఉంటాయి. కొందరు పిల్లలైతే పెద్దలు కూడా చేయని విధంగా అనేక విన్యాసాలు చేస్తుండడం చూస్తుంటాం. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లాడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్జిబిషన్‌కు వెళ్లిన పిల్లాడు జనాల మధ్యలో ఉన్నట్టుండి చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు (child) కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఎగ్జిబిషన్‌కు (Exhibition) వెళ్లాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అక్కడ ఆ పిల్లాడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. తండ్రితో కలిసి ఎగ్జిబిషన్‌లో అన్నీ ఆసక్తిగా గమనిస్తున్న బాలుడు.. చివరకు గుండ్రంగా తిరుగుతున్న ఓ వీల్ వద్ద ఆగాడు.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..


కొద్దిసేపు ఆ గుండ్రటి వీల్‌ను ఆసక్తిగా గమనించాడు. అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ వీల్‌ను పట్టుకుని గాల్లో వేలాడాడు. అంతలోనే దాని పైకి పల్టీలు కొట్టి.. పైన ఉన్న ఇనుప రాడ్డు పట్టుకుని (child performed stunts in the exhibition) విన్యాసాలు చేశాడు. ఇలా కొద్ది సేపు దానిపై విచిత్ర విన్యాసాలు చేసి, చివరకు మళ్లీ నేలపై దూకేస్తాడు. సర్కస్‌లో అనుభవం ఉన్న వారిలా ఆ పిల్లాడు చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు.

Viral Video: రొమాంటిక్‌గా రీల్ చేయాలనుకున్న జంట.. మధ్యలో ఎంటరైన కుక్క.. చివరకు కంపు కంపు చేసిందిగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడు పిల్లాడు కాదు.. చిచ్చరపిడుగు’’.. అంటూ కొందరు, ‘‘స్పైడర్ సినిమా చూసిన తర్వాత పుట్టాడేమో’’.. అంటూ మరికొందరు, ‘‘వీడు పిల్లాడా.. లేక గ్రహాంతరవాసా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పొట్టకూటి కోసం పామును ఇబ్బంది పెట్టలేక.. రోడ్డుపై వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Jul 26 , 2024 | 05:07 PM