Share News

Viral Video: కారులో సింహాన్ని చూసి ఖంగుతిన్న పిల్లి.. చివరకు సింహం నిర్వాకం చూసి..

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:19 PM

మనుషుల తరహాలోనే జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు సీరియస్ ఘటనలు జరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్యర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ...

Viral Video: కారులో సింహాన్ని చూసి ఖంగుతిన్న పిల్లి.. చివరకు సింహం నిర్వాకం చూసి..

మనుషుల తరహాలోనే జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు సీరియస్ ఘటనలు జరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్యర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కారులో ఉన్న సింహాన్ని చూసి పిల్లి ఖంగుతింది. చివరకు సింహం ఎక్స్‌ప్రెషన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వాహనాలు రద్దీలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కారులో సడన్‌గా సింహాన్ని చూసి వాహనదారులంతా షాక్ అయ్యారు. ఎవరో సింహాన్ని తమ (lion in a car) కారు వెనుక సీట్లో పెట్టుకుని ఎక్కడికో తరలిస్తున్నారు. అదే సమయంలో మరో కారులో ముందు వైపు ఓ పిల్లి కూర్చుని ఉంది.

Viral Video: ఇదెక్కడి ఐడియారా అయ్యా.. బైకును బస్సులా మార్చాడే.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..


ఈ క్రమంలో సింహానికి బోరు కొట్టిందో ఏమో గానీ.. కారు కిటికీ బయటికి తల పెట్టి వాహనాలను చూస్తోంది. అదే సమయంలో సమీపంగా వచ్చిన కారులో పిల్లిని చూసింది. పిల్లి కూడా సింహాన్ని చూసి షాక్ అయింది. అదే సమయంలో (yawning lion) సింహం ఆవలించడాన్ని చూసిన పిల్లి.. అలాగే చూస్తూ ఉండిపోయింది. ‘‘అడవిలో రాజులా ఉండాల్సిన నువ్వు కూడా.. నాలాగా పిల్లిలా మారిపోయావా’’.. అన్నట్లుగా ఆ పిల్లి ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..


పిల్లిని చూసిన సింహం కూడా.. ‘‘ఈ సమయంలో నేను ఎవరినీ ఏమీ చేయలేకపోతున్నా’’.. అన్నట్లుగా చూస్తుండిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం.. ఉబెర్ కారును బుక్ చేసుకుందేమో’’.. అంటూ కొందరు, ‘‘పిల్లిలా మారిన సింహం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Jul 25 , 2024 | 09:19 PM