Share News

Viral Video: రైలును ఆపేందుకు పట్టాలపై ఎదురుగా వెళ్లి ముద్దులు పెట్టాడు.. ఇంజిన్‌ను ఆపిన డ్రైవర్.. ఆ వెంటనే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:05 PM

రైలు ప్రయాణం చేస్తూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. ఇంకొదరు సెల్ఫీల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిత్యం...

Viral Video: రైలును ఆపేందుకు పట్టాలపై ఎదురుగా వెళ్లి ముద్దులు పెట్టాడు.. ఇంజిన్‌ను ఆపిన డ్రైవర్.. ఆ వెంటనే..

రైలు ప్రయాణం చేస్తూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. ఇంకొదరు సెల్ఫీల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కూడా చాలా మంది అలాగే ప్రవర్తించడం చూస్తుంటాం. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. రైలును ఆపేందుకు పట్టాల పైకి వెళ్లి పదే పదే గాల్లో ముద్దులు పెట్టాడు. దీంతో ఇంజిన్‌ను ఆపిన డ్రైవర్ చివరికి ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి రైలు పట్టాలపై నడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఎదురుగా ఓ లోకల్ రైలు (Local train) వస్తోంది. రైలును చూసిన ఆ యువకుడు పట్టాల మధ్యలోకి (man tried to stop the train while kissing) వెళ్లి గాల్లో ముద్దులు పెడుతూ ఇంజిన్‌లోని డ్రైవర్‌కు సైగలు చేశాడు.

Viral Video: ఐకమత్యం అంటే ఇదీ.. పాము నుంచి స్నేహితుడిని కాపాడేందుకు ఈ కుక్క పిల్లలు చేసిన కృషి చూస్తే..


యువకుడి నిర్వాకం చూసి ట్రైన్ డ్రైవర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. ఆ వెంటనే కిందకు దిగి పరుగెత్తుకుంటూ అతడి వైపు వచ్చాడు. రైలు డ్రైవర్ రావడాన్ని చూసిన యువకుడు.. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతలోనే పరుగెత్తుకుంటూ వచ్చిన ట్రైన్ డ్రైవర్.. ఆ యువకుడిని వెనుక వైపు నుంచి చేత్తో గట్టిగా కొడతాడు. దెబ్బకు ధబేల్‌మని కిందపడిపోతాడు. పిచ్చి పనులు చేస్తూ ఇబ్బంది పెడతావా.. అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఇంజిన్ డ్రైవర్ చాలా బాగా బుద్ధి చెప్పాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనుల వల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అనవసరంగా కోతితో పెట్టుకుందే.. చివరకు పులి పరిస్థితి చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jul 26 , 2024 | 09:05 PM