Share News

Viral Video: అనవసరంగా కోతితో పెట్టుకుందే.. చివరకు పులి పరిస్థితి చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jul 26 , 2024 | 07:01 PM

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ చెట్టు కొమ్మ నుంచి దూరాన ఉన్న మరో కొమ్మ చెట్టు కొమ్మ పైకి అవలీలగా జంప్ చేస్తుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు దుకాణాల్లోని తినుబండారాలను లాక్కొని చెట్టుపైన చిటారుకొమ్మలపై దర్శనమిస్తాయి. దీంతో..

Viral Video: అనవసరంగా కోతితో పెట్టుకుందే.. చివరకు పులి పరిస్థితి చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ చెట్టు కొమ్మ నుంచి దూరాన ఉన్న మరో కొమ్మ చెట్టు కొమ్మ పైకి అవలీలగా జంప్ చేస్తుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు దుకాణాల్లోని తినుబండారాలను లాక్కొని చెట్టుపైన చిటారుకొమ్మలపై దర్శనమిస్తాయి. దీంతో వాటిని వెంబడించే సాహసం మనుషులతో పాటూ జంతువులు కూడా చేయవు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా చివరికి ఆశాభంగం తప్పదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పులి కోతిపై దాడి చేయాలని చూసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులికి కోతి కనిపిస్తుంది. దాన్ని చూడగానే ‘‘ఈ పూటకు కోతితో సరిపెట్టుకుందాం’’.. అనుకుంటూ (Tiger attacks monkey) దానిపై దాడికి దిగుతుంది. అయితే పులి రావడం చూసి కోతి పరుగు పరుగున వెళ్లి చెట్టు పైకి చేరుకుంటుంది. అయినా పులి కూడా ఏమాత్రం వెనక్కకు తగ్గకుండా చెట్టు పైకి ఎక్కుతుంది.

Viral Video: ఐకమత్యం అంటే ఇదీ.. పాము నుంచి స్నేహితుడిని కాపాడేందుకు ఈ కుక్క పిల్లలు చేసిన కృషి చూస్తే..


‘‘నాతోనే ఆటలా.. ఉండు చూపిస్తా... నేనేంటో’’.. అని అనుకుందో ఏమో గానీ.. ఆ కోతి చివరకు చెట్టు కొమ్మల అంచులు పట్టుకుని వేలాడింది. దాన్ని పట్టుకునేందుకు పులి కూడా చివరకు వెళ్లింది. దీంతో బరువు ఎక్కువై ఒక్కసారిగా (tiger fell from the top of tree) పైనుంచి ధబేల్‌మని కిందపడిపోతుంది. కోతి మాత్రం ఎంచక్కా.. మరో కొమ్మపైకి జంప్ చేస్తుంది. ఇలా కోతిపై దాడి చేయాలని చూసిన పులికి.. చివరికి నిరాశే మిగులుతుంది.

Viral Video: వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో అందరికీ షాక్ ఇస్తూ..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతి పవర్ ఏంటో.. ఇప్పుడు తెలిసి ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘అనవసరంగా కోతితో పెట్టుకుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 26 , 2024 | 07:01 PM