Share News

Viral Video: వంద నోటు దొరికిందని సంబరపడ్డాడు.. తీరా చేతిలోకి తీసుకుని చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:59 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంతో మంది తమ తెలివితేటలకు పదునుపెట్టి ఆదాయం గడిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు.. వినూత్నంగా ఆలోచిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటారు. కొందరైతే...

Viral Video: వంద నోటు దొరికిందని సంబరపడ్డాడు.. తీరా చేతిలోకి తీసుకుని చూడగా.. షాకింగ్ సీన్..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంతో మంది తమ తెలివితేటలకు పదునుపెట్టి ఆదాయం గడిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు.. వినూత్నంగా ఆలోచిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటారు. కొందరైతే చిత్రవిచిత్రమైన పద్ధతుల ద్వారా తమ వ్యాపారానికి పబ్లిసిటీ ఇచ్చుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా.. రోడ్డుపై వంద నోటు కనిపించింది. దీంతో అతను ఎంతో సంబరపడ్డాడు. అయితే నోటును చేతిలోకి తీసుకుని చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్లగానే అతడికి రోడ్డు మధ్యలో ( hundred rupee note on the road) వంద రూపాయాల నోటు కనిపించింది. మడిచి ఉన్న నోటును చూడగానే అతను ఎంతో సంబరపడ్డాడు. వెంటనే చేతిలోకి తీసుకుని నోటు మడత విప్పాడు. ఓ వైపు బాగానే ఉంది గానీ.. రెండో వైపు తిప్పగానే షాకింగ్ సీన్ కనిపిచింది.

Viral Video: పెళ్లిలో తాళి కట్టే ముందు వధువు చేయాల్సిన పనిని.. వరుడు చేయడంతో.. ఏం జరిగిందో చూడండి..

నోటుకు మరోవైపు ఓ కేఫ్‌కు సంబంధించిన వివరాలు ఫ్రింట్ చేసి ఉన్నాయి. సాధారణంగా ప్రకటనల పేపర్లు చేతికి ఇస్తే.. ఆసక్తి చూపించరనే ఉద్దేశంతో సదరు వ్యాపారులు ఇలా వినూత్నంగా ఆలోచించారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్ల చేస్తున్నారు. ‘‘వీరి మార్కెటింగ్ ఐడియా అదిరింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ వీడియో చూసిన వ్యాపారులంతా.. ఇకపై ఇలాగే చేస్తారేమో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చట్ట విరుద్ధం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నాడో.. కోతికి ఆహారం తినిపిస్తూ.. ఇతడు ఏం చేశాడో చూస్తే..

Updated Date - Jan 02 , 2024 | 02:59 PM