Share News

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:18 PM

చాలా మంది చిన్న పిల్లలకు ఆటలు తప్ప మరో ప్రపంచం తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వివిధ రకాల పనులు చేస్తూ పెద్ద వారు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. ఇంకొందరు...

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..

చాలా మంది చిన్న పిల్లలకు ఆటలు తప్ప మరో ప్రపంచం తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వివిధ రకాల పనులు చేస్తూ పెద్ద వారు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. ఇంకొందరు పిల్లలైతే ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంట్లో అందరూ నిద్రపోయా ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక ఇంట్లో అందరూ నిద్రపోయాక విచిత్ర నిర్వాకానికి పాల్పడింది. ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి డోరు తీసి ఏకంగా లోపలికి వెళ్లింది. లోపల ఉన్న ర్యాక్‌లపై కాలు పెట్టి పైన ఉన్న డబ్బాలోని (child stole the ice cream from fridge) ఐస్ క్రీంను ఎంచక్కా లాగించేస్తోంది. అయితే అదే సమయంలో ఆ తల్లికి అనుమానం వచ్చి ఫ్రిడ్జి వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. తన కూతురు చేసిన ఈ పనికి మురిసిపోయిన ఆ తల్లి.. ఫోన్‌‌లో మొత్తం రికార్డ్ చేసింది.

Viral Video: అదృష్టం అంటే ఇతడితే.. 60 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకుతుండగా.. కొమ్మ విరగడంతో..


ఫ్రిడ్జి డోరు తీయగానే.. తప్పు చేస్తూ దొరికిపోయినట్లుగా ఆ చిన్నారి ఉలిక్కిపడింది. తర్వాత బయటికి రావాలని చెప్పడంతో ఐస్ క్రీం తినడం మానేసి మెల్లగా బయటికి వచ్చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పట్టుబడిన గజ దొంగ’’... అంటూ కొందరు, ‘‘ఈ పాప ఎంతో క్యూట్‌గా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ.. తండ్రీకొడుకులు కలిసి రైల్వే స్టేషన్‌లో చేతులు పట్టుకుని మరీ ఇలా..

Updated Date - Jul 10 , 2024 | 07:22 PM