Share News

Viral Video: వామ్మో.. పూర్తిగా కట్ చేసిన చేపను నీళ్లలోకి వేయగా.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Aug 29 , 2024 | 06:11 PM

చేపలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బురదలో పూర్తిగా ఎండిపోయిన చేపకు.. నీళ్లు పోయగానే ప్రాణం రావడాన్ని చూశాం.. అలాగే తల లేని చేప నీటిలో ఈదుకుంటూ రావడం కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: వామ్మో.. పూర్తిగా కట్ చేసిన చేపను నీళ్లలోకి వేయగా.. చివరకు ఏమైందో చూడండి..

చేపలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బురదలో పూర్తిగా ఎండిపోయిన చేపకు.. నీళ్లు పోయగానే ప్రాణం రావడాన్ని చూశాం.. అలాగే తల లేని చేప నీటిలో ఈదుకుంటూ రావడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్రకరమైన చేపను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పూర్తిగా కట్ చేసిన చేపను నీటిలో వేయగా.. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలు కట్ చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అన్ని చేపల మాదిరే ఓ పెద్ద చేపను కూడా కట్ చేస్తాడు. తల తీసేసి, దాని కడుపులోని పేగులను కూడా తీస్తాడు. అయితే ఆ తర్వాత మిగిలిన చేపను అంతా చూస్తుండగా నీటిలో పడేస్తాడు. దీంతో చూస్తుండగానే ఆ చేప.. సాధారణ చేపల్లాగే కదులుతుంది.

Viral Video: గుండెల్ని పిండేసే వీడియో.. గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులు.. గ్రామస్తులు నిప్పు పెట్టడంతో చివరకు..


కదలడమే కాకుండా మెలికలు తిరుగుతూ అక్కడి నుంచి దూరంగా (dead fish is swimming in the water) ఈత కొడుతూ వెళ్తుంది. మళ్లీ పట్టుకోవాలని ప్రయత్నించినా చిక్కకుండా చేతిలోంచి జారి నీటిలోకి వెళ్లిపోతుంది. ఇలా పూర్తిగా కట్ చేసిన చేప.. నీటిలో ఈదడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Mahabubabad: భర్తకు దివ్యాంగురాలితో రెండో పెళ్లి చేసిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది సాధారణమే.. కండరాలు మరియు నరాల్లో ఆక్సిజన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇలా కదలుతుంటాయి’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇది దెయ్యం చేపలా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 29 , 2024 | 06:11 PM