Share News

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:23 PM

ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. సినిమా సీన్లు కూడా దిగుదుడుపే అని అనిపిస్తుంటుంది. కొందరైతే నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. వివాహ మంటపాల్లోకి..

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..

ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. సినిమా సీన్లు కూడా దిగుదుడుపే అని అనిపిస్తుంటుంది. కొందరైతే నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. వివాహ మంటపాల్లోకి లగేజీ ట్రాలీలు, బైకులు, ట్రాక్టర్లలో ఎంటరయ్యే వధూవరులను చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు విచిత్రంగా ఆలోచించాడు. తన భార్యను ఇంటికి తీసుకెళ్తు్న్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వధూవరులు (bride and groom) కళ్యాణ మంటపంలోకి గుర్రాల మీద ఎంటర్ అవుతుంటారు. అలాగే ఊరేగింపులోనూ ఎక్కువగా గుర్రాలనే ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం బైకులు, ట్రాక్టర్లు వంటి వాహనాలను కూడా వాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ నూతన జంట ఎలాంటి వాహనం వాడకుండా కేవలం వారి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరికి చిన్న టెక్నిక్‌తో..


వివాహం పూర్తయ్యాక అప్పగింతల అనంతరం వధువును వరుడు తనతో పాటూ ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు. అయితే ఇందుకోసం వాహనం కాకుండా ఓ పెద్ద రాకెట్ (Rocket) ఏర్పాటు చేసి దానిపై కూర్చుని ఎదురు చూస్తుంటాడు. ఇంతలో కుటుంబ సభ్యులంతా కలిసి వధువును పంపిస్తారు. ఆ తర్వాత వధువు వచ్చి రాకెట్‌కు వెనుక వైపు కూర్చుంటుంది. వధూరులు రాకెట్‌పై కూర్చోగానే ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వెనుక వైపు నిప్పు పెడతాడు. దీంతో చూస్తుండగానే రాకెట్ గాల్లోకి లేస్తుంది.

Viral Video: మిగిలిపోయిన చపాతీలతో ఇలాక్కూడా చేయొచ్చా.. ఇతడి తెలివికి హ్యాట్సాప్..


వధూవరులు ఇద్దరూ ఆకాశంలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా రాకెట్‌పై వెళ్లినట్లుగా వీళ్లు చేసిన గ్రాఫిక్స్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎడిటింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాత్రూంలో దాక్కున్న అత్యంత విషపూరిత పాము.. చివరకు అది చేసిన పని చూసి ఖంగుతిన్న స్నేక్ క్యాచర్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 08:23 PM