Share News

Viral Video: విమానం ఎక్కబోతూ ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:36 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పల్లెటూరికి చెందిన ఓ వ్యక్తి విమానం ఎక్కేందుకు వెళ్లాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. విమానం ఎక్కబోతూ తలుపు వద్ద అతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: విమానం ఎక్కబోతూ ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..

‘‘రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదు’’.. అన్న సామెత చందంగా కొందరు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి విమానం ఎక్కబోతూ తలుపు వద్ద చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘విమానం ఎక్కబోతూ కూడా అలవాటు మానుకోలేదు కదా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పల్లెటూరికి చెందిన ఓ వ్యక్తి విమానం ఎక్కేందుకు వెళ్లాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. విమానం (airplane) ఎక్కబోతూ తలుపు వద్ద అతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. భుజానికి ఓ సంచి తగిలించుకుని విమానం ఎక్కడానికి వెళ్లిన వ్యక్తి.. తీరా విమానం తలుపు వద్దకు వెళ్లగానే లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడ్డాడు.

Viral Video: గుండె తరుక్కుపోయే వీడియో.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి..


విమానం లోపలికి వెళ్తే మళ్లీ అవకాశం ఉంటుందో ఉండదో అని అనుకున్నాడో ఏమో గానీ.. జేబులోంచి ఖైనీ ప్యాకెట్ బయటికి తీశాడు. దాన్ని అరచేతిలోకి పోసుకుని మరో చేత్తో దానిపై (man chewing tobacco at airplane door) చాలా సేపు తడుతూ ఉన్నాడు. మొదట ఎవరికీ అనుమానం రాకున్నా.. చేతిలో ఖైనీ వేసుకుని తడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎయిర్‌హోస్టెస్ చూసి అవాక్కయ్యారు. అతడి నిర్వాకం గురించి ఓ హెయిర్‌హోస్టెస్.. మరో హెయిర్‌హోస్టెస్‌తో మాట్లాడడం కూడా వీడియోలో చూడొచ్చు.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


మొత్తానికి తలుపు వద్ద నిలబడి తీరిగ్గా ఖైనీ వేసుకున్న అతను.. ఆ తర్వాత తాపీగా లోపలికి వెళ్లిపోతాడు. అయితే ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో అతడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఖైనీ వేసిన అంకుల్.. లోపల ఎక్కడ ఉమ్మివేస్తాడో ఏమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇతడి చేతిలో మంత్రం ఉందా.. మొసళ్లన్నీ భయంతో ఎలా పారిపోతున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 07:39 PM