Share News

Viral Video: గుండె తరుక్కుపోయే వీడియో.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి..

ABN , Publish Date - Aug 25 , 2024 | 06:02 PM

కొందరు పొట్టకూటి కోసం ప్రమాదమని తెలిసినా శక్తికి మించిన పనులు చేస్తుంటారు. మరికొందరు అవగాహన లేమితో చేసే పనులు చివరకు తమ ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: గుండె తరుక్కుపోయే వీడియో.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి..

కొందరు పొట్టకూటి కోసం ప్రమాదమని తెలిసినా శక్తికి మించిన పనులు చేస్తుంటారు. మరికొందరు అవగాహన లేమితో చేసే పనులు చివరకు తమ ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి భారీ గోడ వద్ద పని చేస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి పెద్ద బిల్డింగ్ గోడ వద్ద నిలబడి పని చేస్తుంటాడు. గోడ మధ్యలో తాడు కట్టి లాగుతుంటాడు. మరో వ్యక్తి దూరంగా నిలబడి వీడియో తీస్తుంటాడు. అయితే సదరు వ్యక్తి లాడుతో లాగుతూ ఉండగా.. ఉన్నట్టుండి ఆ గోడలో కొంత భాగం ఊడి కిందపడుతుంది.

Viral Video: ప్రాణం పోయే ముందు ప్రతాపం చూపించిన రొయ్య.. ఈ యువతికి ఏమైందో చూస్తే..


అయితే ప్రమాదవశాత్తు సగం గోడ అక్కడ నిలబడ్డ (heavy wall fell on man) వ్యక్తిపై పడిపోతుంది. దీంతో దూరంగా వీడియో తీస్తున్న వ్యక్తి.. కేకలు పెడుతూ అతన్ని కాపాడేందుకు పరుగులు పెడతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గోడ కూలే దిశను సరిగా అంచనా వేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైనట్లు కనిపిస్తోంది.

Viral Video: ఇతడి చేతిలో మంత్రం ఉందా.. మొసళ్లన్నీ భయంతో ఎలా పారిపోతున్నాయో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో అవగాహనతో ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 49 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 06:02 PM