Share News

Viral Video: కోడితో పాటూ మనిషినీ లాగేయాలని చూసిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Aug 24 , 2024 | 07:24 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మొసళ్లకు ఆహారం తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. కోండి మాంసంతో నీటి ఒడ్డుకు వెళ్తాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న పెద్ద మొసలి అతడికి దగ్గరగా వెళ్తుంది. ఈ క్రమంలో అతను..

Viral Video: కోడితో పాటూ మనిషినీ లాగేయాలని చూసిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

మొసళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటితో ఆటలు ఆడటం అటుంచి, కనీసం దగ్గరగా వెళ్లాలని చూసినా ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు వాటిని కూడా పెంపుడు జంతువుల్లా చూసుకుంటుంటారు. పెద్ద పెద్ద మొసళ్లను చిన్న పిల్లల్లా లాలిస్తూ మాంసాన్ని గోరు ముద్దలుగా తినిపించే యువతులను చూశాం. అలాగే మొసళ్ల గుంపు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లే వ్యక్తినీ చూశాం. అయితే ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కొన్నిసార్లు మొసళ్లు అందరికీ షాక్ ఇస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి కోడితో పాటూ మనిషిని కూడా లాగేయాలని చూసింది. చివరికి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మొసళ్లకు ఆహారం తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. కోండి మాంసంతో నీటి ఒడ్డుకు వెళ్తాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న పెద్ద మొసలి అతడికి దగ్గరగా వెళ్తుంది. ఈ క్రమంలో అతను కూడా కోడిని మొసలికి చూపిస్తూ దగ్గరగా వెళ్తాడు. మొసలి వద్దకు వెళ్లి (Man tried feed chicken to crocodile) దాని నోట్లో కోడిని విసరాలని చూస్తాడు.

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబోయ్.. పాముతో కాకి ఫైట్.. చివరికిలా..!


అయితే మొసలి కోడితో పాటూ అతడిని కూడా నీటిలోకి లాగాలని చూస్తుంది. కోడిని పట్టుకుని కిందపడేసిన మొసలి.. నేరుగా అతడిపైకి (crocodile attacked on Man) దాడికి దిగుతుంది దీంతో మొసలి నుంచి తప్పించుకునేందుకు అతను వేగంగా వెనక్కు వెళ్లిపోతాడు. ఈ క్రమంలో కిందపడతాడు. మరోవైపు మొసలి దాదాపు సమీపానికి వెళ్తుంది. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి మొసలి తలపై చేయి పెట్టి శాంతింపజేస్తాడు.

Viral Video: కోతి చేష్టలు చేస్తున్న పక్షులు.. వ్యక్తి భోజనం చేస్తుంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..


ఎట్టకేలకు మొసలి శాంతించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మొసళ్లతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘తక్కువ మాంసం తెచ్చారని ఇలా చేసిందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 07:24 PM