Share News

Viral Video: ఒట్టి చేతులతో కొండచిలువను పట్టేందుకు యువతి ప్రయత్నం.. అయితే చివరకు..

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:08 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పంట పొలాల్లోకి కొండ చిలువ రావడం చూసి రైతులు భయంతో పరుగులు పెడతారు. కొండచిలువ అక్కడే తిష్ట వేయడంతో చాలా మంది దాని దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే..

Viral Video: ఒట్టి చేతులతో కొండచిలువను పట్టేందుకు యువతి ప్రయత్నం.. అయితే చివరకు..

పాములు, కొండచిలువలతో కొందరు ఆటలు ఆడాలని చూసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు స్నేక్ క్యాచర్లు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాములు పట్టాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఒట్టి చేతులతో కొండచిలువను పట్టేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరూ చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంట పొలాల్లోకి కొండ చిలువ రావడం చూసి రైతులు భయంతో పరుగులు పెడతారు. కొండచిలువ అక్కడే తిష్ట వేయడంతో చాలా మంది దాని దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే ఓ యువతి మాత్రం ధైర్యంగా ముందుకు వస్తుంది. ఒట్టి చేతులతో కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: బాబోయ్.. ఇది పక్షి కాదు రాక్షసి.. 15 సెకన్ల గ్యాప్‌లో ఏకంగా..


బురదలో దాక్కున్న కొండచిలువ వద్దకు వెళ్లి తోక పట్టుకుని పక్కకు లాగేయాలని చూస్తుంది. అయితే కొండచిలువ వెనక్కు తిరిగి బుసలు కొట్టడంతో భయంతో వదిలేస్తుంది. అయినా మళ్లీ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కొండచిలువకు తిక్కరేగి ఆమె పైకి దూకుతుంది. దీంతో సదరు యువతి దూరంగా పరుగెడుతుంది. అంతటితో ఆగని ఆ యువతి (young woman tried catch python) చివరిసారిగా మళ్లీ ఓసారి ప్రయత్నిస్తుంది. ఈసారి తోక పట్టుకుని కాస్త దూరం లాగి చివరకు తానే బురదలో పడిపోతుంది.

Viral Video: కుంటిదైనా సింహం సింహమే.. అలా ఎంట్రీ ఇచ్చి.. ఎలా హడలెత్తించిందో చూడండి..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతి ప్రయత్నం వృథా అయింది’’.. అంటూ కొందరు, ‘‘మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాం.. అయితే ఇలా వాటిని బాధపెట్టడం తప్పు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 09:08 PM