Share News

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:45 PM

ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన వారంతా వారి వారి పనులు చేసుకుంటూనే పనిలో పనిగా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఇక శుభాకార్యాల సమయంలో అయితే రీల్స్ వీడియోలకు కొదవే ఉండదు. పెళ్లిళ్లలో రీల్స్ చేసే క్రమంలో వధూవరులు వివిధ రకాల ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. అలాగే..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన వారంతా వారి వారి పనులు చేసుకుంటూనే పనిలో పనిగా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఇక శుభాకార్యాల సమయంలో అయితే రీల్స్ వీడియోలకు కొదవే ఉండదు. పెళ్లిళ్లలో రీల్స్ చేసే క్రమంలో వధూవరులు వివిధ రకాల ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. అలాగే పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వధూవరులతో ప్రాంక్ వీడియోలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిలవని పెళ్లికి వెళ్లిన ఓ యువకుడు విందు ఆరగించాడు. అయితే చివరగా వధువు వద్దకు వెళ్లి అతను గిఫ్ట్ ఏంటో చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) పిలవని పెళ్లి వెళ్లాడు. అయినా అతను ఎంతో హుందాగా పెళ్లి మంటపంలోకి ప్రవేశించాడు. లోపల మొత్తం ఓ రౌండ్ వేసిన తర్వాత విండు ఆరగించాడు. అయితే అక్కడ తిన్న ఆహార పదార్థాలన్నింటినీ (food items) అతను లెక్కకట్టాడు. ముందుగా ప్లేట్ థాలీ రూ.300తో పాటూ ప్లేట్ మంచూరియా రూ.50, గులాబ్ జామూన్ రూ.20, కాఫీ, ఇతర ఆహార పదార్థాలు కలిపి రూ.100లుగా లెక్కకడతాడు.

Viral Video: ఈమె విన్యాసం మామూలుగా లేదుగా.. బస్సులో సీటు కోసం చివరకు ఏకంగా..


అతను తిన్న ఆహారం పదార్థాలన్నీ కలిపి మొత్తం రూ.470లు అవుతుంది. ఖరీదైన భోజనం తిన్నందుకు బదులుగా వధువుకు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అతను అసలు ట్విస్ట్ ఇచ్చాడు. జేబులోంచి పది రూపాయల నోటు బయటికి తీసిన అతను దాన్ని అందమైన కవర్‌లో పెట్టేస్తాడు. చివరగా వేదిక పైకి వెళ్లి (man gifted ten rupee note to the bride) ఆ కవర్‌ను వధువుకు అందజేస్తాడు. కవర్ తీసుకున్న వధువు చివరకు అందులో నోటు చూసి అవాక్కవుతుందన్నమాట.

Viral Video: వామ్మో.. వెన్నులో వణుకు పుట్టించే సీన్.. 8 ఏళ్ల బాలిక పైకి దూకిన పెద్ద డేగ.. చివరకు చూస్తే..


ఇదంతా చూస్తుంటే వ్యూస్, లైక్‌ల కోసం వారు కావాలనే ఇలా సరదాగా వీడియో తీసినట్లు అనిపిస్తుంది. అయినా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నికర లాభం రూ.460లు అన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘చాలా ఎక్కువ మొత్తం ఇచ్చారండీ.. రూ.5 ఇచ్చుంటే సరిపోయేది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 03:45 PM